Polling has ended: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఒకేసారి జరిగింది. సాయంత్రం 6 గంటల లోపు క్యూలైన్లలో నిల్చున్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మొత్తం అసెంబ్లీ 175 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ జరిగింది.
కాగా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.