BigTV English

AP Elections 2024: ఏపీలో టీడీపీ, వైసీపీ దాడులు ఎక్కడెక్కడంటే..?

AP Elections 2024: ఏపీలో టీడీపీ, వైసీపీ దాడులు ఎక్కడెక్కడంటే..?

Ap Assembly Elections Highlights: పల్నాడు జిల్లా నరసరావు పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం దగ్గర వైసీపీ నేతలు హల్ చల్ చేశారు. వైసీపీ నేతలు ఓటర్లపై దాడులకు పాల్పడటంతో పాటు..టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు కారుపై దాడి చేశారు.


వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో వైసీపీ నేతలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. దాడిని టీడీపీ వర్గీయులు తిప్పికొట్టారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టగా.. అక్కడకు చేరుకున్న పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించి రెండు వర్గాలను చెదరగొట్టారు.

Also Read: MK Meena on polling percentage: పోలింగ్ శాతం పెరిగిందన్న మీనా, అది పాజిటివ్ అన్న వైసీపీ

తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరువురు పరస్పర దాడులకు పాల్పడ్డారు. వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే మేరిగ మురళిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో గోకర్ణపల్లిలో ఉద్రికత నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో అధికారులు భారీగా సెంట్రల్ ఫోర్స్ ను రంగంలోకి దించారు . జనరల్ ఏజెంట్ గా పోలింగ్ కేంద్రంలో స్పీకర్ సతీమణి తమ్మినేని వాణి ఉండగా.. ఆమెను బయటకు పంపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

Also Read: Attack On Chandragiri MLA Candidate: చంద్రగిరిలో హైటెన్షన్.. కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×