BigTV English
Advertisement

Posani Krishna Murali : పోసానితో ‘ఫుట్ బాల్’ – బెయిల్ వచ్చినా జైల్లోనే ఎందుకు?

Posani Krishna Murali : పోసానితో ‘ఫుట్ బాల్’ – బెయిల్ వచ్చినా జైల్లోనే ఎందుకు?

Posani Krishna Murali : వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్ర అభ్యంతర పదజాలంతో విమర్శలు గుప్పించిన పోసాని కృష్ణమురళీ.. పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక కేసులో అరెస్టై రిమాండా ముగిసిన వెంటనే.. మరో కేసులో అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఒక కేసులో బయటకు వచ్చే లోగానే.. అటునుంచి అటే మరో కేసులో విచారణ పేరుతో పోలీసులు పట్టుకుపోతున్నారు. ప్రశాంతంగా సినిమా పరిశ్రమలో ఉన్న పోసాని.. తన నోటికి పని చెప్పడంతో ఇప్పుడీ పరిస్థితి కొని తెచ్చుుకున్నారు అంటున్నారు.. ఆయన సన్నిహితులు. ఇన్నాళ్టికి కానీ, అసలు రాజకీయాలు అంటే ఎలా ఉంటాయి, వాటి ప్రభావం ఏ తీరుగా ఉంటాయో తెలిసొచ్చేలా చేస్తున్నారు. కాగా.. ఈ మధ్య కడపలోని మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. అయినా.. ఆయన కోర్టులు, స్టేషన్ల చుట్టూనే తిరిగుతున్నారు. అందుకు కారణమేంటి. ఎన్నాళ్లు పోసాని కేసుల ఊబి నుంచి బయటపడే అవకాశాలు లేవు అనే చర్య రాష్ట్రంలో తీవ్రంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పోసానిపై రాష్ట్రంలో నమోదైన వివిధ కేసులు.. పోసాని బయటకు రాకపోవడాని కారణాల్ని తెలుసుకుందాం.


ఏఏ జిల్లాల్లో కేసులు నమోదైయ్యాయి

ఆలోచనకు తోచిందే మాట, నోటికి వచ్చిందే విమర్శ అన్నట్లు వైసీపీ హయాంలో ప్రెస్మీట్లల్లో తీవ్రమైన అభ్యంతర, వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన పోసాని కృష్ణమురళీపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి. వీటిలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం ఉపయోగించడం వంటి కారణాలతో నమోదైన కేసులే అధికం. ఏఏ జిల్లాల్లో కేసులు నమోదు చేశారు అంటే.. 0
కడప జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లల్లో పోసాని కృష్ణ మురళీపై పోలీసు కేసు నమోదైంది. పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీ సెల్, ఎస్సీ సెల్ నేతలు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. పోసాని పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు పోలీస్ స్టేషన్‌లోనూ ఇలాంటి కేసే నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఇలాగే.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీస్ స్టేషన్లో, కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో, అనంతపురం జిల్లాలో ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి చివరి నాటికి దాదాపు 50కి పైగా పోలీసు కేసులు నమోదైయ్యాయి. ఇవ్వన్నీ.. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, మాటలపైనే నమోదైయ్యాయి.


పోసానిపై నమోదైన సెక్షన్లు ఇవే..

పోసానిపై నమోదైన కేసుల్లో చాలా వరకు భారతీయ న్యాయ స్మృతి (BNS) 2023 లోని వివిధ సెక్షన్లు కింద కేసులు పెట్టారు. వాటిలో.. వ్యక్తిగత అవమానం చేయడం(సెక్షన్ 323), ఇతరుల గౌరవాన్ని హననం చేయడం లేదా తప్పుడు ఆరోపణలు చేయడం(సెక్షన్ 499), ఉద్దేశపూర్వకంగా అవమానించడం ద్వారా శాంతి భంగం చేయడానికి ప్రేరేపించడం(సెక్షన్ 504), ఇతరులను బెదిరించడం లేదా హాని చేయాలని బెదిరించడం( సెక్షన్ 506), గోప్యంగా లేదా గుర్తు తెలియని విధంగా బెదిరింపులు పంపించడం(సెక్షన్ 507), మహిళల వినయం అవమానపరిచే చర్యలు(సెక్షన్ 509) వంటి సెక్షన్లను జోడించారు.

సినీ నటుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు పోసాని కృష్ణమురళీపై ఏపీలోని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో తొలిసారిగా 2025 ఫిబ్రవరి 24న అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పోసానిని అరెస్టు చేసిన పోలీసులు.. రైల్వే కోడూరులో విచారించి, అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం కోర్టులో హజరుపరిచగా.. 14 రోజుల రిమాండ్ విధించడంతో.. రాజం పేట సబ్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలీసు కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

పోసానికి అన్నమయ్య జిల్లాలోని ఓబులాపురంలో నమోదైన కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. కానీ.. రాష్ట్రంలోని మిగతా కేసుల్లో ఆయపై నమోదైన కేసుల కారణంగా.. ఇంకా విడుదల సాధ్యం కాలేదు. తాజాగా.. పోసాని కృష్ణ మురళీపై విజయవాడలోని ఓ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా.. కర్నూలు జిల్లా జైలు నుంచి పీడీ వారెంట్ పై విజయవాడకు తీసుకువచ్చారు.. భవానీ పురం పోలీసలుు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడలోని సీఎంఎం కోర్టులో హజరుపర్చగా.. ఈ నెల 20 వరకు పోసాని రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

కాగా.. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో సహా మంత్రులు, వారి కుటుంభ సభ్యులు, వారింట్లో వాళ్లను, మీడియా సంస్థలపై ఇష్టానుసారం.. అసభ్యకర పదజాలంతో దూషించారని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. జనసేన నేత శంకర్ ఫిర్యాదుతో విజయవాడలోని భవానీపురం పోలీసులు పోసానిని అరెస్టు చేశారు.

తనపై అక్రమ కేసులు పెట్టారంటూ ఆరోపిస్తున్న పోసాని కృష్ణ మురళి.. ఒకే విధమైన కేసులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెట్టి.. తనను ఇష్టానుసారం తిప్పుతున్నారంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గుండె జబ్బు ఉందని, పక్షవాతం లాంటి రుగ్మతలు వేధిస్తున్నాయని కోర్టులో న్యాయమూర్తి ముందు పోసాని వివరించారు. అలా.. ఒక చోట నుంచి మరోచోటకు పోసాని కృష్ణ మురళీ జైళ్లు తిరుగుతూనే ఉన్నారు. ఈ కేసులు ఎప్పుడు ముగుస్తాయి, ఎన్నటికి బయటపడతాడు అన్నది మాత్రం.. ఇంకా సస్పెంన్స్ గానే ఉంది.

Tags

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×