BigTV English

Prakash Raj : జస్ట్ ఆస్కింగ్… పవన్‌ను ప్రశ్నించావు సరే, స్టాలిన్‌ను వదిలేశావు ఎందుకు ?

Prakash Raj : జస్ట్ ఆస్కింగ్… పవన్‌ను ప్రశ్నించావు సరే, స్టాలిన్‌ను వదిలేశావు ఎందుకు ?

నేను మోనార్క్ ని. నన్నెవడూ మోసం చేయలేడు. ఈ డైలాగ్ ప్రకాశ్ రాజ్ కంటే ఫేమస్ అయ్యింది. దక్షిణాది సినీ రంగంలో ప్రకాశ్ రాజ్ చాలా పాపులర్. ఆయన చేసిన క్యారెక్టర్లు, పాత్రలు బహుశ మరే ఇతర ఆర్టిస్టులు అంత పర్ఫెఫ్ట్ గా చేయలేరేమో అనేలా నటిస్తారు. కాదు కాదు జీవిస్తారు. అలాంటి ప్రకాశ్ రాజ్ నిజ జీవితంలో సామాజిక అంశాల మీద తరచుగా స్పందిస్తుంటారు. కానీ ఎందుకో అందులో చాలా వరకు వివాదాస్పదం అవుతుంటాయి.


విధాన పరమైన నిర్ణయాలపైనా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం సూచనలు ఇస్తుంటారు. అప్పుడప్పుడు వార్నింగులు కూడా ఇస్తారు. ఇక ట్విట్టర్ వేదికగా అయితే ఎన్నో ఇష్యూలపై తనదైన శైలిలో వాగ్భానాలు సైతం సంధిస్తుంటారు.

పవన్ పైనే వ్యంగాస్త్రాలు…


అయితే తాజాగా తిరుమల లడ్డూలో పంది నెయ్యి కలిపారన్న వివాదంలో ప్రకాశ్ రాజ్ వైఖరి ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. కానీ పవన్ కల్యాణ్ పై మాత్రం ఎక్స్ వేదికగా ఆయన వ్యంగాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనపైనా ఆయన ఎలాంటి స్పందన చేయకుండా ఉండిపోయారు.

పవన్ చేసేది తప్పైతే.. జగన్ చేసేది ఏమిటీ ? లడ్డూపై వివాదం నెలకొన్న సమయంలో తిరుపతి పర్యటన అంటూ హంగామా చెయ్యడం ఏమిటీ ? ఈ విషయాలను ప్రకాష్ రాజ్ పట్టించుకోవడం లేదా ? లేదా జగన్‌ను సమర్దిస్తున్నాడా అని జనాలు అనుకుంటున్నారు.

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనపైనా ఆయన ఎలాంటి స్పందన చేయకుండా ఉండిపోయారు. కానీ ఒక్క పవన్ కల్యాణ్ ను మాత్రమే ఆయన ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందని ఆయన అభిమానులే కాదు సగటు తెలుగు వ్యక్తి కూడా అసంతృప్తిగా ఉన్నారట.

వాళ్లు మాట్లాడితే మాత్రం నో రెస్పాన్స్…

గతంలో తమిళనాడు మంత్రి, డీఎంకే సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన సాంప్రదాయంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. కానీ ప్రకాశ్ రాజ్ మాటలు మాత్రం ఆయన పెదవి దాటలేదు. ఉదయనిధి స్టాలిన్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎందుకు బెల్లం అవుతున్నారు, కలిసి నటించిన పవన్ కల్యాణ్ ఎందుకు అల్లం అవుతున్నారని సినీ ఫ్యాన్స్ సైతం తెగ ఆలోచిస్తున్నారట. ప్రకాశ్ రాజ్ కు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లోకెల్లా బీజేపీ అంటే ఎందుకు అంతెత్తుకు లెగుస్తారో అర్థం కాదని, భారతీయ జనతా పార్టీ ఏం తప్పు చేసిందని భావిస్తున్నారట.

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే పార్టీల విధానపరమైన నిర్ణయాలను తప్పుబట్టని ప్రకాశ్ రాజ్, కేవలం బీజేపీ, టీడీపీ, జనసేనలతో కూడిన కూటమి ప్రభుత్వాన్నే ఎందుకు నిందిస్తున్నారో ఆయన స్పష్టం చేయాలని మరికొందరు నెట్టింట ప్రశ్నిస్తున్నారు.

హిందూలపై ప్రకాశ్ రాజ్ ఇట్టే మాట్లాడేస్తారు మరి…

సెక్యులరిస్టుగా చెప్పుకునే ప్రకాశ్ రాజ్ మత సమస్యలపై కాకుండా కేవలం హిందూ ధర్మంపైనే సులభంగా మాట్లాడతారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇతర మతాలపై మాత్రం ఆయన మాట్లాడరు అన్న పేరును ఆయన సంపాదించుకున్నారు.

మరోవైపు తాను బీజేపీ విధానాలను విమర్శిస్తే తనను హిందూ వ్యతిరేక వ్యక్తిగా ముద్ర వేస్తారని ప్రకాశ్ రాజు అంటుంటారు. త‌న‌కేమాత్రం సంబంధం లేని ప‌వ‌న్‌, కార్తీ ముచ్చట్లలోకి ప్ర‌కాశ్ రాజ్‌ అనవసరంగా త‌ల‌దూర్చుతున్నాడని జనం అనుకుంటున్నారట.

తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ ఇద్దరితోనూ ప్ర‌కాశ్‌రాజ్ సత్సంబంధాలు ఉన్నాయట. ఇప్పుడు ఈ మాట రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ పేరెత్తితే మాత్రం ప్రకాశ్ రాజ్ కు చిర్రెత్తుకొస్తుంది. దీనికి కారణం ఆయనే చెప్పాలని క్రిటిక్స్ కోరుకుంటున్నారు. నిజ జీవితంలో ప్ర‌కాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో మునిగిపోతుండటం గమనార్హం.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×