BigTV English

Prakashraj Pavan: ప్రకాష్ రాజ్ చిలిపి సందేశం.. ఇక్కడ కూడా పవన్ ని ఇరికించాలా?

Prakashraj Pavan: ప్రకాష్ రాజ్ చిలిపి సందేశం.. ఇక్కడ కూడా పవన్ ని ఇరికించాలా?

ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడినా, ఏ అంశంపై ట్వీట్ వేసినా ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేయక మానరు. పదే పదే ఈ విషయాన్ని ఆయన రుజువు చేశారు, చేస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓ బిల్లు విషయంలో కూడా ఆయన పవన్ కల్యాణ్ ని ఇరికించేలా ట్వీట్ వేశారు. ఒక చిలిపి సందేహం.. అంటూ ప్రకాష్ రాజ్ వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


“మహాప్రభు .. తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక , మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినే ఉపముఖ్యమంత్రిని” ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా..!” అంటూ ట్విట్టర్ ద్వారా ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు వెంటనే గుర్తొచ్చే పేరు పవన్ కల్యాణ్. ప్రకాష్ రాజ్ కూడా క్లియర్ గా తెలుగులోనే ట్వీటారు కాబట్టి ఆయన ఉద్దేశంలో ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కల్యాణే కావొచ్చు. పైగా పవన్, మోదీ మధ్య.. జనసేన, బీజేపీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ దశలో చంద్రబాబుని దించేసి, పవన్ ని సీఎం పీఠంపై కూర్చోబెట్టే కుట్ర బీజేపీ చేస్తోందా? ఆ బిల్లు అంతరార్థం అదేనా? అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ వేయడం విశేషం.

కాంగ్రెస్ సంచలనం..
క్రిమినల్ కేసుల్లో అరెస్టు అయి 30 రోజులపాటు జైలుశిక్ష అనుభవిస్తే.. ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు.. వారి పదవులనుంచి ఆటోమేటిక్ గా తొలగింపబడతారనే బిల్లుని కేంద్రం తాజా లోక్ సభ లో ప్రవేశ పెట్టింది. దీంతో ప్రతిపక్షాలు రచ్చ రచ్చ చేశాయి. ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీసేందుకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లు తెరపైకి తెచ్చిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, నితీష్ కుమార్ ను టార్గెట్ చేసేందుకే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణల్ని బీజేపీ నేతలు తిప్పికొట్టినా.. సగటు ప్రజల్లో కొత్త అనుమానాలు మొదలైనట్టే అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టడానికే బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందనే ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎలా తిప్పికొట్టాలో కమలనాథులకు అర్థం కావడం లేదు.

మధ్యలో పవన్ కల్యాణ్..
కాంగ్రెస్ ఆరోపణల్లో చంద్రబాబు పేరు వినిపించింది. ఒకవేళ బీజేపీ టార్గెట్ చంద్రబాబే అయితే దాని ద్వారా లాభపడేది పవన్ కల్యాణే అని ప్రకాష్ రాజ్ పరోక్షంగా ట్వీట్ ద్వారా ప్రస్తావించారు. అందుకే ఆయన డిప్యూటీసీఎం అనే పోస్ట్ ని నొక్కి చెప్పారు. ఇక రాజకీయంగా పవన్ కల్యాణ్ ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మిగతా నాయకులపై పెద్దగా విమర్శలు చేయని ప్రకాష్ రాజ్, పవన్ పేరెత్తితే మాత్రం విమర్శలతో విరుచుకుపడతారు. కేవలం పవన్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పవర్ స్టార్ అభిమానులకు టార్గెట్ అవుతున్నారు ప్రకాష్ రాజ్. తాజాగా మరో ట్వీట్ వేసి హాట్ డిస్కషన్ కి తెరతీశారు.

Related News

YS Sharmila: షర్మిల సంచలన పోస్ట్.. జగన్ లోగుట్టు, కొత్త నిర్వచనం

Srisailam News: అటవీ సిబ్బందిపై దాడి ఘటనలో కొత్త ట్విస్ట్..మళ్లీ ఏమైంది?

AP Govt: ఏపీ తీరానికి మహర్దశ.. రూ. 9,000 కోట్ల పెట్టుబడి, ప్రపంచస్థాయి టెర్మినళ్ల నిర్మాణం

AP Politics: ఉపరాష్ట్రపతి ఎన్నిక..రెండువైపులా జగన్‌ మేనేజ్ చేస్తున్నారా? ఖర్గేతో మేడా భేటీ వెనుక

Nellore Ysrcp: కాకాణి రాకతో మారిన నెల్లూరు రాజకీయం.. జిల్లాపై పెత్తనం ఎవరిదంటే?

Big Stories

×