BigTV English

Big Shock to KCR: కేసీఆర్‌‌కు హైకోర్టు షాక్, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, కాళేశ్వరం రిపోర్టుపై వ్యాఖ్య

Big Shock to KCR: కేసీఆర్‌‌కు హైకోర్టు షాక్, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, కాళేశ్వరం రిపోర్టుపై వ్యాఖ్య

Big Shock to KCR: కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చేసింది చీఫ్ జస్టిస్ ధర్మాసనం. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.


మరోవైపు కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటాని ధర్మాసనానికి చెప్పారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి. ఆయన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. పిటిషనర్లు ఇద్దరు ఎమ్మెల్యేలని, వారిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలంటూ కేసీఆర్, హరీష్‌రావులు హైకోర్టుతో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై గురువారం, శుక్రవారం రెండు రోజులుగా న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపు సుప్రీంకోర్టు న్యాయవాదులు సుందరం, శేషాద్రినాయుడు వాదించారు. నివేదికకు సంబంధించి సెక్షన్ 8B, 8C కింద నోటీసు ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.


నివేదికపై అసెంబ్లీలో చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా? లేకుంటే చర్యలు చేపట్టి చర్చ చేస్తారా? అన్నదానిపై సుధీర్ఘం విచారణ సాగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున నిర్ణయాన్ని కాపీ రూపంలో ఏజీ సుదర్శన్‌రెడ్డి న్యాయస్థానానికి సమర్పించారు. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఆయా వివరాలను ప్రజల ముందు పెట్టి కేసీఆర్, హరీష్‌‌రావులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ALSO READ: ఇంజనీరింగ్ ఫీజుల పెంపు.. తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్

అసెంబ్లీలో రిపోర్టు ప్రవేశపెట్టడానికి ఆరునెలల సమయం పడుతుందని తెలిపారు. పిటిషన్లు ఇద్దరు సభలో సభ్యులుగా ఉన్నారని, వారిముందే చర్చ పెడతామని తెలిపారు. ఏజీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కమిషన్ నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని తప్పు పట్టింది హైకోర్టు. ఒకవేళ వెబ్‌సైట్‌లో ఉంటే రిపోర్టును వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నివేదికను ప్రభుత్వం ఎక్కడా పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టలేదని వివరించారు ఏజీ. ఒకవేళ పెడితే వెంటనే తొలగించాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చింది. దీనిపై మూడు వారాల్లో పూర్తి కౌంటర్‌ దాఖలు చేయాలని కేసీఆర్‌, హరీష్‌రావులకు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం ఆదేశించింది.

న్యాయస్థానం నుంచి క్లారిటీ రావడంతో అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై చర్చ పెట్టనుంది ప్రభుత్వం. మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లయ్యింది.  అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత రిపోర్టుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నారు.  అప్పుడు సిట్ వేస్తుందా? సీబీఐకి అప్పగిస్తుందా? సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడే విధంగా ముందుకు వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

 

Related News

Heavy Rains: రాష్ట్రంలో మళ్లీ కుండపోత వానలు.. రెండ్రోజులు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, భారీ పిడుగులు..?

Harish Rao: తెలంగాణ బీజేపీ ఎంపీలకు హరీష్ రావు సవాల్.. ఆ విషయంలో కేంద్రాన్ని అడిగే దమ్ముందా..?

Telangana Jagruthi: కవిత సమక్షంలో.. బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరికలు

Hyderabad Real Estate: MSN రియాల్టీ సంస్థ సరికొత్త రికార్డ్.. ఎకరా స్థలం రూ.177 కోట్లకు కొనుగోలు

Telangana Pharma Hub: ఫార్మా ఇండస్ట్రీలో మరో మైలురాయి.. హైదరాబాద్ నుంచే ప్రపంచ స్థాయి ఔషదాల తయారీ

Election Code: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలు

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..

BC Reservations: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత..

Big Stories

×