E-Paper
Advertisement

PM Modi: నేడు ఏపీ, తమిళనాడు పర్యటనకు ప్రధాని మోదీ..

PM Modi: నేడు ఏపీ, తమిళనాడు పర్యటనకు ప్రధాని మోదీ..
Advertisement

PM Modi: నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అలాగే, కోయంబత్తూరులో జరిగే రైతుల సదస్సులో పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మోడీ తన పర్యటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. సత్యసాయి బాబా సమాజ సేవను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని గుర్తు చేసుకున్నారు.

పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో.. పాల్గొననున్న మోడీ..
ఉదయం 10 గంటలకు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకుంటారు ప్రధాని. శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు. అనంతరం 10:30 గంటలకు జరిగే శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా గౌరవార్థం ఒక స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Advertisement

కోయంబత్తూరులో జరిగే రైతుల సదస్సులో.. పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదల..
ప్రధాని ఏపీ నుంచి తమిళనాడుకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కోయంబత్తూరులో దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సు 2025ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేస్తారు. 21వ విడత కింద 18,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేయనున్నారు ప్రధాని మోడీ. ఈ సదస్సులో ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి సుమారు 50,000 మంది రైతులు, నిపుణులు పాల్గొననున్నారు.

Also Read: కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు మృతి..

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×