BigTV English
Advertisement

Where is Pinnelli : పిన్నెల్లి ఎక్కడ ? సినిమాను తలపిస్తోన్న పరారీ ఎపిసోడ్

Where is Pinnelli : పిన్నెల్లి ఎక్కడ ? సినిమాను తలపిస్తోన్న పరారీ ఎపిసోడ్

Pinnelli Ramakrishna latest news(AP political news): మే 13, ఏపీలో పోలింగ్ జరిగిన రోజు. ఆ రోజున మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో సృష్టించిన అరాచకం వీడియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పిన్నెల్లిపై ఏకంగా 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో పిన్నెల్లి పరారయ్యారు. తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ముందు సంగారెడ్డి, తర్వాత ఇస్నాపూర్ ఫామ్ హౌస్.. ఆ తర్వాత ఇంకెక్కడ ఉన్నారన్నదీ తెలియలేదు. అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశారు.


పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇందూ విల్లాస్ కు చేరుకున్నారు. అక్కడ ఆయన ఇంటి నుంచి కారు బయటకు రాగా.. ఆ కారును ఫాలో అయ్యారు. నేషనల్ హైవే 65పై కారు స్పీడుగా వెళ్లడం గమనించి.. సంగారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగం సహాయం కోరారు ఏపీ పోలీసులు. పిన్నెల్లికోసం సంగారెడ్డి పోలీసులు కంది కూడలి వద్ద పాగా వేశారు. టెంపరరీ చెక్ట్ పోస్ట్ ఏర్పాటు చేసి.. అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కారు హైవే వైపు రాకుండా.. పటాన్ చెరు వైపు దారి మళ్లింది. రుద్రారం వైపుగా కొంతదూరం వెళ్లిన కారు.. గణేష్ తండా వద్ద ఆగిపోయింది. ఆ కారులో ఏపీలో పోలీసులకు డ్రైవర్, గన్ మ్యాన్ మాత్రమే కనిపించారు. పిన్నెల్లి ఫోన్ వారివద్దే ఉండటాన్ని చూసి షాకయ్యారు. పోలీసుల్ని పిన్నెల్లి తప్పుదోవ పట్టించాడని అర్థమైంది.

Also Read : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ?


వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పిన్నెల్లి గురించి విచారించగా అసలు విషయం చెప్పారు. కారు ఆగగానే ఫోన్‌ తమకిచ్చిన పిన్నెల్లి.. డివైడర్‌ దాటి రోడ్డుకు అటువైపు వెళ్లారని, అప్పటికే అక్కడ మరో వాహనం సిద్ధంగా ఉందని.. అందులో ఎక్కి హైదరాబాద్‌ వైపు వెళ్లిపోయారని వివరించారు. డ్రైవర్, గన్ మ్యాన్ ను సంగారెడ్డి సీసీఎస్ కు తరలించారు. అయితే.. తానెక్కడికీ పారిపోలేదని పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ కు వచ్చానని పిన్నెల్లి చెబుతున్నా.. దేశం దాటి వెళ్లిపోయారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

రామకృష్ణారెడ్డి దుబాయ్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారని, పోలీసుల అప్రమత్తమై అరెస్ట్ కు రంగం సిద్ధం చేయడంతో.. ఆయన వ్యూహం బెడిసికొట్టిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పిన్నెల్లి సోదరులకు తెలంగాణలో కొందరు BRS‌ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని, వారి ఫామ్‌హౌస్‌లో వారు తలదాచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా కాదు.. తాజాగా ఆయన తమిళనాడుకు వెళ్లినట్లు మరో వార్త. మరోవైపు పిన్నెల్లి వ్యవహారంలో ఏపీ పోలీసులు ఫెయిలయ్యారన్న వాదనలు బలంగా వినవస్తున్నాయి. మరింతకీ పిన్నెల్లి దేశంలోనే ఉన్నాడా ? ఉంటే ఎక్కడున్నాడు ? పోలీసులు తెలియక అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారా ? తెలిసే వైసీపీ ఒత్తిళ్లకు ఏమైనా తలొగ్గారా ? అన్నది సస్పెన్స్ గా మారింది.

పాల్వాయి గేట్ ఘటన ఒక్కటే కాదు.. పిన్నెల్లి ఆదేశాలతో మాచర్ల నియోజకవర్గంలోని కొత్తపుల్లారెడ్డిగూడెంలోనూ పోలింగ్ రోజున పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్లుగా ఉన్నవారిపై వైసీపీ రౌడీ మూకలు దాడిచేసిన వీడియోలు ఇప్పుడు వెలుగుచూశాయి. పిన్నెల్లి ఆదేశాలతోనే ఇదంతా జరిగినట్లు టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు. నేడు టీడీపీ ఛలో మాచర్లకు పిలుపునివ్వగా అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉండటంతో.. పోలీసులు అనుమతి నిరాకరించారు. మాచర్లకు రాకుండా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

https://twitter.com/bigtvtelugu/status/1793469306199498942

Tags

Related News

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

Big Stories

×