BigTV English

Rachamallu Siva Prasad Reddy : పోలీసులకు సారీ చెప్పిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే .. ఆ వ్యాఖ్యలు ఉపసంహరణ..

Rachamallu Siva Prasad Reddy : పోలీసులకు సారీ చెప్పిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే .. ఆ వ్యాఖ్యలు ఉపసంహరణ..

Rachamallu Siva Prasad Reddy : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎక్సైజ్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. పోలీసులకు క్షమాపణలు తెలిపారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని రాచమల్లు వివరణ ఇచ్చారు. మద్యం కొనుగోళ్లకు సంబంధించి చట్టంలో మార్పులు తీసుకురావాలని సూచించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి లేఖ కూడా రాస్తానని చెప్పారు.


గురువారం కడప జిల్లా ప్రొద్దుటూరు SEB అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలు అవసరాలకు మద్యం తీసుకెళితే నిబంధనలు పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రొద్దుటూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి మరికొంత మందితో కలిసి.. తన తల్లి కర్మఖాండల కార్యక్రమం కోసం 30 మద్యం బాటిళ్లు కొనుగోలు చేశారు. షాపు నుంచి కిందకు దిగగానే పుల్లయ్యను సెబ్ అధికారులు అరెస్ట్ చేశారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. SEB కార్యాలయానికి వెళ్లి అధికారుల తీరుపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారిని ఇబ్బందులకు గురిచేస్తే ఎన్నిసార్లు అయినా ఇలాగే వచ్చి ప్రశ్నిస్తానంటూ ఎమ్మెల్యే అన్నారు. పోలీసులపై ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసులకు క్షమాపణలు చెప్పారు.


.

.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×