Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శల జోరు సాగుతోంది. పవన్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నా, ఈ విమర్శలు మాత్రం ఆగడం లేదు. సాధారణంగా పవన్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ విమర్శలు ఓకే. కానీ ఇక్కడ పవన్ ను టార్గెట్ చేసింది మాత్రం ఎవరో కాదు ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్. పవన్ లక్ష్యంగా ఆ డైరెక్టర్ చేసే కామెంట్స్ కొత్త కానప్పటికీ, ఇప్పుడు కాస్త లైన్ దాటి మరీ ఆయన విమర్శలు చేశారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ డైరెక్టర్ చేసిన ఘాటు కామెంట్స్ ఏమిటో తెలుసుకుందాం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం గా, పంచాయతీ రాజ్, అటవీ శాఖ మంత్రిగా పవన్ తన మార్క్ పాలన సాగిస్తున్నారు. పవన్ ఇప్పుడు అవలంబిస్తున్న పద్దతులకు ప్రజలు కూడా మద్దతునిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అంతవరకు ఓకే గానీ, అధికారంలోకి రాక ముందు పవన్ చేసిన విమర్శల సెగ ఇంకా ఆయనను తాకుతోంది.
పవన్ లక్ష్యంగా విమర్శలు..
అధికారంలోకి రాక ముందు పవన్ వారాహి యాత్ర చేపట్టిన విషయం తెల్సిందే. ఆ యాత్రలో అప్పటి అధికార పార్టీ వైసీపీ, మాజీ సీఎం జగన్ లక్ష్యంగా పలు ఘాటైన విమర్శలు చేశారు. ఆ విమర్శలే ఇప్పుడు పవన్ కు ఎదురు తగులుతున్నాయి. అధికారంలోకి వచ్చిన సమయం నుండి పవన్ ఎన్నో పర్యటనలు చేస్తూ, ఓ వైపు జనవాణి నిర్వహిస్తూ ప్రజలకు చేరువలో ఉంటున్నప్పటికీ, నాటి సెగ ఇంకా పవన్ ను తాకుతోంది.
దర్శకుడి ఘాటైన విమర్శలు..
పవన్ పై గతంలో వైసీపీ నుండి విమర్శలు వచ్చేవి. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్, నటుడి నుండి ఘాటైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరో కాదు చిట్టిబాబు. ఈయన నోటికి కాస్త స్పీడ్ ఎక్కువని కూడా విమర్శకులు అంటుంటారు. ఎంత స్పీడ్ అని పేరు పొందారో, అంతే స్పీడ్ గా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చిట్టిబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
32 వేల మంది అమ్మాయిలు ఏమయ్యారు?
ఓ ఇంటర్వ్యూలో చిట్టిబాబు మాట్లాడుతూ.. పవన్ లక్ష్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. అధికారంకు ముందు 32 వేల మంది అమ్మాయిలు కనిపించలేదని ఆరోపించి, ఆ తర్వాత కేంద్రంలో మంత్రిగా ఉన్న బండి సంజయ్ అదేమీ లేదని చెప్పడం ఎందుకు సంకేతం అన్నారు. కేవలం ఓట్ల కోసం పవన్ ఆ కామెంట్స్ చేశారని విమర్శించారు. ఇంతకు అమ్మాయిల మిస్సింగ్ గురించి నాడు పవన్ కు చెప్పిన ఆ అధికారి ఎవరో ముందు పవన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
గంజాయి ఎక్కడ?
కాకినాడ పోర్టులో గంజాయి రవాణా అవుతుందని నాడు పవన్ చెప్పారని, చివరకు సీబీఐ ఎంక్వైరీలో డ్రై ఐస్ గా తేలిందన్నారు. అక్కడ జరిగేది ఒకటి, పవన్ కామెంట్స్ మరొకటి అంటూ చిట్టిబాబు చెప్పారు. పవన్ మాటలను మొదట తాను నమ్మానని, ఇప్పుడు నమ్మే పరిస్థితిలో తాను లేనన్నారు.
పాచిపోయిన లడ్లు ఎక్కడ?
చిట్టిబాబు మాట్లాడుతూ.. పవన్ గతంలో పాచిపోయిన లడ్లు అంటూ కామెంట్స్ చేశారని, కేవలం అధికారంలోకి వచ్చేందుకు, ఇతరులను ఇరకాటంలో పెట్టేందుకు పవన్ ఎంతకైనా తెగిస్తారన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులను మోసం చేసిన క్రెడిట్ పవన్ కే దక్కుతుందని, ప్రత్యేక హోదా అంటూ మాటలు సాగదీసి నేడు ఎందుకు సైలెంట్ అయ్యారో పవన్ చెప్పాలన్నారు.
నాడు సనాతని కాదా?
ఎన్నికలకు ముందు మతకల్లోలాలకు హిందువులు కారణం అంటూ ఆరోపించి, నేడు సనాతని రాగాన్ని పవన్ ఎందుకు ఎత్తుకున్నారో తెలియాలన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు కంటే దారుణంగా పవన్ తయారయ్యారని, పవన్ నీది నాలుకా, నాలుక పట్టా అంటూ చిట్టిబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పిఠాపురంలో రేప్ జరిగితే స్పందించవు, కానీ పబ్లిక్ మీటింగ్ లలో మాత్రం ఆవేశంగా మాట్లాడి ప్రజలను మోసం చేయడంలో పవన్ దిట్ట అంటూ చిట్టిబాబు ఫైర్ అయ్యారు.
Also Read: Tech AI 2.0 Conclave: గుడ్డు రికార్డ్ ఏపీకే.. ఆ క్రెడిట్ కొట్టేసింది!
చిట్టిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండగా, కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ తమ స్పందన తెలుపుతున్నారు. పవన్ గురించి ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకొనేది లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఈ కామెంట్స్ కు జనసేన స్పందించి కౌంటర్ ఇస్తుందా? లేదా అన్నది తేలాల్సి ఉంది.
.@PawanKalyan అనే అసెంబ్లీ లో అడుగు పెట్టడానికే ఇన్ని వేశాలు వేశారు ⁉️
చంద్రబాబు గారికన్నా ఘోరమైన అబద్ధాల కొరివి 🤣🤣🤣 pic.twitter.com/vpSq9g3Z4w
— For A Reason (@FAR_IN_X) May 14, 2025