Manchu Manoj..ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో ఏ చిన్న వేడుక జరిగినా సరే సెలబ్రిటీలందరూ హాజరవుతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒకరికొకరు తమ మధ్య ఉన్న స్నేహాన్ని మరింత బలపరచుకోవడానికి ఇలాంటి వేడుకలకు వస్తూ ఉంటారు. ఇక పెళ్లిళ్లకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఏ చిన్న ఆర్టిస్టు వివాహం జరిగినా లేదా ప్రొడ్యూసర్స్ కూతురు లేదా కొడుకు పెళ్లి జరిగినా సరే సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంటుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ మేనేజర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న ప్రముఖ మేనేజర్ అట్లూరి సురేష్ బాబు (Atluru suresh Babu) ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ప్రొడ్యూసర్ కూతురు పెళ్లిలో సందడి చేసిన మనోజ్ దంపతులు..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ మేనేజర్అట్లూరి సురేష్ బాబు , అట్లూరి మాధవి దంపతుల ఏకైక కూతురు త్రిపుర సాయి (Tripura Sai) కి.. శ్రీ హరిరావు, శ్రీ సుంకర వెంకట సుగుణావతి ఏకైక కొడుకు ప్రశాంత్ (Prashanth) తో 2025 మే 10వ తేదీన రాత్రి 7:09 గంటలకు చిత్త నక్షత్రమున వృశ్చిక లగ్న పుష్కరాంశ ముహూర్తాన వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితులు హాజరై సందడి చేశారు. ఇకపోతే హైదరాబాద్ లోని గండిపేటలో అజీజ్ నగర్ క్రాస్ రోడ్ లో.. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఉన్న ఓగా కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ వివాహానికి ప్రముఖ స్టార్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి(Bhuma Mounika Reddy) సతీసమేతంగా ఈ వివాహానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ ;Heroine Aditi Shankar: అందుకే మా నాన్న డైరెక్షన్లో మూవీ చేయలేదు.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్..!
మంచు మనోజ్ సినిమాలు:
మంచు మనోజ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), నారా రోహిత్ (Nara Rohit) లతో కలిసి ‘భైరవం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కూతురు అదితి శంకర్ (Aditi Shankar) హీరోయిన్గా తొలిసారి తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తోంది. ఇకపోతే మంచు మనోజ్, అదితి శంకర్ చిన్నప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్ అట. తాను చిన్నతనం నుంచే మనోజ్ కి తెలుసని, ఆయన తమ ఇంటి పక్కనే ఉండే వారని అదితి తెలిపింది. ఎంతో కాలం తర్వాత మొదటిసారి సినిమా సెట్ లో కలుసుకున్నప్పుడు ఇద్దరికీ ఆశ్చర్యంగా అనిపించిందని కూడా తెలిపింది. ఇకపోతే అదితి హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. ఈమె గని , గేమ్ ఛేంజర్ సినిమాలో పాటలు పాడింది.