BigTV English

Pulivarthi Nani : నకిలీ ఓట్లపై రచ్చ.. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న టీడీపీ నేత పులివర్తి నాని..

Pulivarthi Nani : తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. చంద్రగిరిలో నమోదైన నకిలీ ఓట్లు తొలగించాలని తిరుపతి గ్రామీణం ఆర్డీవో కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. వారికి పోటీగా అధికార వైసీపీ నేతలు దళితులతో కలిసి అక్కడే నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో ఆర్డీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

చంద్రగిరి నియోజకవర్గం బోగస్ ఓట్ల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు సోమవారం ఉదయం నుంచి ఆర్డీవో కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు దళితులకు ఓటు హక్కు కల్పించాలంటూ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఓట్లు అవకతవకలపై ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఒకే సమయంలో వైసీపీ , టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల అరెస్టును నిరసిస్తూ చంద్రగిరి టీడీపీ ఇంచార్జ్ పులివర్తి నాని ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. నకిలీ ఓట్లపై‌ అధికారులు చర్యలు తీసుకునే వరకు దీక్ష‌ను కొనసాగిస్తానని తెలిపారు.

గత 7 నెలలుగా ఓట్ల జాబితాపై పోరాటం చేస్తున్నఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పులవర్తి నాని ఆరోపించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రోద్బలంతోనే భారీగా దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని తెలిపారు. బోగస్ ఓట్లపై అన్ని ఆధారాలు సమర్పించినా అధికారులు చర్యలు తీసుకొవడం లేదని వాపోయారు. నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. త్వరలోనే ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. ఓటమి భయంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బోగస్ ఓట్లు నమోదు చేయిస్తున్నారని పులివర్తి నాని ఆరోపించారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×