E-Paper
Advertisement

AP BJP: అంబటి, జోగి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.. మహిళలోకం సహించదని పురంధేశ్వరి వ్యాఖ్య

AP BJP: అంబటి, జోగి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.. మహిళలోకం సహించదని పురంధేశ్వరి వ్యాఖ్య
Advertisement

AP BJP: ఏపీలో రాజకీయాలు రూటు మారాయా? నేతలు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారా? ఈ విషయంలో వైసీపీ ముందుందా? అధినేత జగన్ బాటలో మిగతా నేతలు నడుస్తున్నారా? అందుకు ఎగ్జాంఫుల్ అంబటి రాంబాబు, జోగి రమేశ్ వ్యాఖ్యలే కారణమా? దీనిపై ఏపీ బీజేపీ ఏమంటోంది?

అంబటి, జోగి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం

Advertisement

రాజకీయాలు పార్టీలు రూటు మార్చాయి. ఒకప్పుడు రాజకీయాలు హుందాగా ఉండేవి. అందులోకి వచ్చేందుకు చాలామంది ఇష్టపడేవారు. కానీ ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. మైలేజీ కోసం అసభ్యకర మాటలు ఆడడం మొదలు పెడుతున్నారు. ఇదే ఒరవడ ప్రస్తుతం ఏపీలో కంటిన్యూ అవుతోంది. సీఎం చంద్రబాబుపై అసభ్యకరమై కామెంట్స్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.

దీనిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ఆయన్ని అరెస్టు చేసే వరకు వెనక్కి తగ్గలేదు. ఫలితంగా ఆయనకు న్యాయస్థానం రెండువారాల రిమాండ్ విధించింది. ఇక మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా అంబటిని ఫాలో అయ్యారు. ఏకంగా మంత్రి లోకేష్‌పై దారుణమైన కామెంట్స్ చేశారు. ఫలితంగా ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. ఈ విషయంలో వైసీపీకి మైలేజీ వస్తుందని ఆ పార్టీ భావించింది.

Advertisement

మహిళలోకం సహించదని పురంధేశ్వరి వ్యాఖ్య

చివరకు బూమరాంగ్ అయ్యింది. ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ రియాక్ట్ అయ్యింది. ఓ వైపు సోము వీర్రాజు.. ఇంకోవైపు పురందేశ్వరి రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారంపై సోమవారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆర్థిక బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ.. మాజీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు తల్లిని అవమానించే విధంగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలను మహిళలోకం సహించదన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను మరొక ఎంపీ సీఎం రమేశ్ కూడా ఖండించారు.

ALSO READ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ క్లీన్ చిట్.. సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నివిధాలుగా ముందుకు వెళ్తోందన్నారు. దాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. గడిచిన మూడురోజులుగా ఏపీలో పరిణామాలు చూస్తున్నామని అన్నారు. చంద్రబాబు పాలన కన్స్ట్రక్టివ్ మోడ్ అని.. జగన్ డిస్ట్రక్టివ్ మోడ్ అని అన్నారు. కావాలనే వైసీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

వైసీపీ ట్రాప్‌లో ఎవరు కూడా పడొద్దని, కూటమి నేతలు ఎవరు తప్పు చేయొద్దన్నారు. శాంతి భద్రతలను సీఎం చంద్రబాబు కాపాడుతున్నారని, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సుపరిపాలన అందిస్తున్నారని గుర్తు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా లేవా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు. కావాలని రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారని, జగన్ కనుసన్నల్లో జోగి రమేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×