ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. రామ్మూర్తి నాయకుడు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. కాగా శనివారం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కాగా ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం చంద్రబాబును ఫోన్ లో పరామర్శించినట్టు సమాచారం అందుతోంది.
Also read: ఇది వీరులను కన్న నేల.. నీలాంటి వాళ్లకు భయపడదు
రామ్మూర్తి మృతిపై చంద్రబాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే పలువురు ప్రముఖులు రామ్మూర్తి మృతిపై సంతాపం ప్రకటించారు. రేపు రామ్మూర్తి పార్థివదేహాన్ని నారావారిపల్లె తరలిస్తుండగానే నేడు చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గచ్చిబౌలి నుండి జూబ్లిహిల్స్ లోని తన నివాసానికి బయలుదేరారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉండగా సోదరుడి మృతి విషయం తెలిసిన వెంటనే అర్దాంతరంగా పర్యటన మధ్యలోనే హైదరాబాద్ చేరుకున్నారు. రేపు ప్రత్యేక విమానంలో కుటంబంతో కలిసి నారావారిపల్లెకి బయలుదేరతారు.