Tilak Varma: టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టి20 స్పెషలిస్ట్ గా టీమిండియాలో చోటు దక్కించుకొని దూసుకు వెళ్తున్నాడు ఈ హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ. సౌత్ ఆఫ్రికా టూర్ లో కూడా అదరగొట్టాడు. ఇప్పటికే మూడవ టి20 అలాగే నాలుగో టి20 మ్యాచ్ లో.. వరుసగా రెండు సెంచరీలు చేసి దుమ్ము లేపాడు. ఈ తరుణంలోనే దేశవ్యాప్తంగా తిలక్ వర్మ పేరు మారుమోగుతోంది.
Also Read: Rohit Sharma Baby: మరోసారి తండ్రైన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ
ఈ నేపథ్యంలోనే… పుష్ప 3 టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే దీనికి కారణం లేకపోలేదు. సౌత్ ఆఫ్రికా తో నాలుగో టెస్ట్ ముగిసిన తర్వాత… టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ మధ్య… ఓ ఆసక్తికర ఇంటర్వ్యూ జరిగింది. ఈ ఇంటర్వ్యూ మొత్తం సరదా సరదాగా ముగించేశారు సూర్య కుమార్ యాదవ్ అలాగే తిలక్ వర్మ.
Also Read: IND vs SA 4th T20i: సౌతాఫ్రికా చిత్తు..135 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ !
ఈ సందర్భంగా… తిలక్ వర్మ హెయిర్ స్టైల్ పైన సరదాగా క్వశ్చన్స్ అడిగాడు సూర్య కు మార్ యాదవ్. నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే పుష్ప 3 సినిమాలో నటించ బోతున్నట్లు కనిపిస్తోంది అంటూ సూర్య కుమార్ ప్రశ్నించాడు. దీనికి అంతే సరదాగా తిలక్ వర్మ కూడా సమాధానం ఇచ్చాడు. తనకు పుష్ప సినిమా చాలా ఇష్టమని…కానీ తాను సినిమాలు చేయబోనని తెలిపాడు తిలక్ వర్మ. తనకు బ్యాట్ అలాగే బంతి తప్ప… ఇంకో ప్రపంచం లేదని క్లారిటీ ఇచ్చాడు తిలక్ వర్మ. దీంతో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
పుష్పా-3లో నటించాలని అనుకుంటున్నావా..?: సూర్య కుమార్ యాదవ్
తిలక్ వర్మ జుట్టు పెంచడంపై SKY చమత్కారం@surya_14kumar @alluarjun @TilakV9#SuryaKumarYadav #TilakVarma #Pushpa3 #BigTV pic.twitter.com/hyUuASCdFy
— BIG TV Breaking News (@bigtvtelugu) November 17, 2024