తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. వర్షాకాలంలో వర్షాలు కురవడం సాధారణమే కానీ ఎండాకాలంలో, శీతాకాలంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. అప్పటివరకు మండే ఎండకొట్టి ఒక్కసారిగా వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు కురవడంతో పంట పొలాలు సైతం నేలమట్టమవుతున్నాయి. దీంతో వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతోంది. అంతేకాకుండా వాతావరణంలో వచ్చే మార్పులతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
Also read: మళ్లీ రంగంలోకి హైడ్రా.. 50 మందికి నోటీసులు.. ఈసారి ఆ భూములు కబ్జా చేసిన వారిపై కొరడా!
ఇప్పుడు తాజాగా మళ్లీ వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్పపీడన ద్రోని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.0 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలోనే దీని ప్రభావంతో రెండు రోజులపాటు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఇది పశ్చిమ దిశగా తమిళనాడు మరియు శ్రీలంక తీరాల వైపు రెండు రోజుల్లో కదిలే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
దీంతో ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మధ్య ట్రోపోస్పోరిక్ స్థాయిల వరకు విస్తరించి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా యానంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో ఈరోజు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. ఇక ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.