BigTV English

MLA Rajasingh: చంద్రబాబు సర్కార్‌‌పై బీజేపీ ఒత్తిడా? రాజాసింగ్ కొత్త డిమాండ్, ఏమిటి?

MLA Rajasingh: చంద్రబాబు సర్కార్‌‌పై బీజేపీ ఒత్తిడా? రాజాసింగ్ కొత్త డిమాండ్, ఏమిటి?

MLA Rajasingh: తిరుమల లడ్డూ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోందా? బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందా? ఆ పార్టీకి చెందిన నేతలు చంద్రబాబు సర్కార్‌పై ఒత్తిడి తెస్తున్నారా? తిరుమలలో బీజేపీ నేతల పర్యటన దేనికి సంకేతం? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.


తిరుమల లడ్డూ వివాదంపై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. తిరుమలలోని ప్రతీ విభాగంలో అన్యమతస్తులు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం పుణ్యమాని అక్కడ చాలామంది తిష్ట వేశారన్న వార్తల నేపథ్యంలో సాధువులు, పీఠాదిపతులు, బీజేపీ నేతలు సైతం తిరుమల బాటపడుతున్నారు. అక్కడ పరిస్థితిని అంచనా వేయనున్నారట.

ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాల్లో అన్యమతస్తులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నది ఎమ్మెల్యే డిమాండ్. పనిలోపనిగా మాజీ సీఎం జగన్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారాయన.


తిరుమల శ్రీవారిని దర్శించుకునే అర్హత జగన్‌కు లేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఘోరమైన పాపం చేసి, అక్కడికి వెళ్లడానికి సిగ్గు అనిపించలేదా అంటూ ప్రశ్నించారు. జగన్ బొమ్మలు కనిపిస్తే చింపేయాలన్న కసితో ప్రజలున్నారని చెప్పారు. హిందూ బోర్డు తీసుకురావాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించడం శుభ పరిణామంగా వర్ణించారు. వక్స్ బోర్డు మాదిరిగా హిందూ బోర్డు తీసుకురావాలన్నది రాజాసింగ్ మరో మెలిక.

ALSO READ:  జనసేనలో వైసీపీ నేతల చేరిక వెనుక భారీ కుట్ర? కూటమిలో కుదుపులు ఖాయం!

ఇంతవరకు బాగానేవుంది. బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ వివాదం ముమ్మాటికీ బీజేపీ కుట్రగా వర్ణించారు. కమలనాథుల డైరెక్షన్‌లో అదంతా జరుగుతోందన్నారు. టీడీపీ-వైసీపీకి మధ్య గొడవ పెట్టి లబ్ది పొందాలన్నది బీజేపీ ప్లాన్‌గా వర్ణించారాయన.

లడ్డూ వివాదంపై జరుగుతున్న పరిణామాలను చంద్రబాబు సర్కార్ గమనిస్తోంది. నేతల మాటలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. లడ్డూ వ్యవహారంపై ఇప్పటికే కేంద్రం రిపోర్టు అడిగింది. ఆ తర్వాత నెయ్యి కల్తీ జరిగిందన్న సంస్థకు షోకాజ్ నోటీసు చేసింది. నివేదిక వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కూటమి సర్కార్ ఆలోచించనుంది.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×