E-Paper
Advertisement

Beauty Tips: వీటితో క్షణాల్లోనే మిలమిల మెరిసే చర్మం మీ సొంతం

Beauty Tips: వీటితో క్షణాల్లోనే మిలమిల మెరిసే చర్మం మీ సొంతం
Advertisement

Beauty Tips: అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ముఖ్యంగా గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా మంది రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. బయట మార్కెట్లో దొరికే ఉత్పత్తులను రసాయనాలతో తయారు చేస్తారు. ఇలాంటివి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని వాడటం వీలైనంత వరకు తగ్గించాలి. ముఖం సహజంగా మెరిసిపోవడం కోసం కొన్ని రకాల పదార్ధాలను వాడటం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువసేపు ఎండలో తిరగడం వల్ల కూడా చర్మం రంగు మారడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా చాలా మందికి మెడ మీద నలుపు రావడం కూడా మొదలవుతుంది. ఈ సమస్యను ముందుగా గుర్తించకపోతే కనక తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖం, మెడపై ఉన్న జిడ్డును తొలగించడంలో కొన్ని హోం రెమెడీస్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ హోం రెమెడీస్‌ పాటించడం ద్వారా ముఖం, మెడపై ఉన్న నలుపును తగ్గించవచ్చు.

Advertisement

ముఖం, మెడపై నలుపును తొలగించే చిట్కాలు..

నిమ్మరసం:
నిమ్మరసం సహజమైన బ్లీచింగ్ ఏజెంట్. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఒక చెంచా నిమ్మరసంలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు ముఖంతో పాటు మెడకు పట్టించాలి. 15-20 నిమిషాల తర్వాత దీనిని కడిగేయాలి.

Advertisement

పెరుగు:

పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది 1 టేబుల్ స్పూన్ పెరుగులో కొంత పసుపు పొడిని మిక్స్ చేసి ముఖానికి , మెడకు అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత దీనిని కడిగేయండి. ఇలా తురుచుగా చేయడం ద్వారా ముఖం పై ఉన్న జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది. అంతే కాకుండా ముఖం అందంగా మారుతుంది.

శనగ పిండి:

శనగపిండి సహజసిద్ధమైన స్క్రబ్. ఇది చర్మాన్ని శుభ్రపరచడంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. 1 టేబుల్ స్పూన్ శనగపిండికి కొంత పెరుగు, పాలు జోడించి పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి మెడకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. ఆరిన 10-15 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా చేయడం ద్వారా ముఖంపై నలుపు దనం తొలగిపోతుంది. అంతే కాకుండా ముఖం అందంగా మెరిసేలా తయారవుతుంది.

అలోవెరా:
కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. అలోవెరా జెల్‌ను వీలు కుదిరినప్పుడల్లా కాస్త ముఖానికి , మెడకు అప్లై చేయాలి. రాత్రంతా అలాగే వదిలేసి ఉదయం కడిగేయండి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది.

Also Read: విటమిన్ ఇ క్యాప్సూల్స్‌లో మీ అందం రెట్టింపు

పసుపు:
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. 1 టీస్పూన్ పసుపు పొడికి కొంత పాలు, పెరుగులో వేసి పేస్ట్ చేయండి. దీన్ని మెడకు పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు తగ్గుతాయి.

ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి.
సిగరెట్, మద్యపానం మానేయండి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. అంతే కాకుండా పుష్కలంగా నీరు త్రాగండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

Big Stories

Advertisement
×