E-Paper
Advertisement

ఉత్తరాంధ్ర బిడ్డగా చెబుతున్నా.. మోదీ ముందు రామ్మోహన్ ఎమోషనల్!

ఉత్తరాంధ్ర బిడ్డగా చెబుతున్నా.. మోదీ ముందు రామ్మోహన్ ఎమోషనల్!
Advertisement

Rammohan Speech: భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తాను ఉత్తరాంధ్ర బిడ్డను అని మాట్లాడుతూ.. ఆ ప్రాంత స్థితిగతులను ప్రధాని ముందు ప్రస్తావించారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు.. పని, అవకాశాల కోసం ప్రపంచం వైపు చూసేవారన్నారు. కానీ ఇవాళ భోగాపురం ఎయిర్ పోర్ట్ వచ్చిన తర్వాత ప్రపంచం మెుత్తం ఉత్తరాంధ్ర వైపు చూడటం ప్రారంభించిదని ఆయన పేర్కొన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ కేంద్రంగా ఎంతోమంది యువతికి ఉపాధి దొరకబోతోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ కు ట్రైనింగ్ ఇక్కడే జరగబోతోందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని ఏ ప్రాంతాన్ని తీసుకున్న సమాన దూరంలో ఉన్న ఈ భోగాపురం ఎయిర్ పోర్ట్.. ఈ ప్రాంతానికి సింహద్వారంగా మారబోతోందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఉత్తర ద్వారాన్ని ఈ భోగాపురం ఎయిర్ పోర్ట్ తెరవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం.. ప్రధానికి ఏపీ తరపున ఇచ్చిన గిఫ్ట్ ఇదే!

మరోవైపు వైసీపీ అధినేత జగన్ పేరు తీయకుండానే పరోక్షంగా ఆయనకు రామ్మోహన్ నాయుడు చురకలు అంటించారు. గతంలో కొంతమంది పాలకులు ఈ ప్రాంతంలో ఎర్ర బస్సు కూడా తిరగదని ఎగతాళి చేశారని గుర్తుచేశారు. ఇవాళ ఎయిర్ బస్ లు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారిందని గర్వంగా చెప్పారు. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని కళ్లు తెరిచి చూడాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఎయిర్ పోర్ట్ వచ్చిందని.. రేపు అంతర్జాతీయ కంపెనీలు ఉత్తరాంధ్రాకు రాబోతున్నాయని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ఇక్కడి యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: ‘నా వయసు 15 ఏళ్లే.. నన్ను క్షమించండి’.. మోదీ విషయంలో యువతి యూటర్న్!

Tags

Related News

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రేటర్ మున్సిపల్‌గా తిరుపతి.. పెరిగిన డివిజన్లు!

విశాఖ పీఠంపై కూటమిలో టెన్షన్.. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మేయర్ సీటు ఫైట్!

రోడ్లు, పార్కింగ్ కూడా ప్రభుత్వమే కట్టాలా? విశాఖ ఐటీ కంపెనీ వింత డిమాండ్లు!

Big Stories

Advertisement
×