E-Paper
Advertisement

ఇండియన్ ట్రైన్ జర్నీపై విదేశీ యువతి రివ్యూ.. నెటిజన్లు ఫిదా!

ఇండియన్ ట్రైన్ జర్నీపై విదేశీ యువతి రివ్యూ.. నెటిజన్లు ఫిదా!
Advertisement

Indian Railway Experience: భారతీయ రైల్వేలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఈ ప్రయాణం ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుంది. తాజాగా డెన్మార్క్‌కు చెందిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ఎమ్మా హోమ్ భారత్ లో తొలిసారిగా స్లీపర్ రైలులో ప్రయాణించి తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ప్రయాణం సవాళ్లతో కూడుకున్నప్పటికీ, జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.

టికెట్ బుకింగ్ నుంచే మొదలైన సవాళ్లు

ఎమ్మా హోమ్ వీడియో ప్రకారం, భారత్ లో రైలు టికెట్ బుక్ చేసుకోవడమే ఒక పెద్ద సవాల్ గా అనిపించిందన్నారు. టికెట్ బుక్ చేసిన తర్వాత కూడా సీటు వెంటనే ఖరారు కాకుండా వెయిటింగ్ లిస్ట్‌ లో ఉండటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఆమెతో పాటు మరో ఇద్దరు కలిసి ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, బయలుదేరే సమయానికి ముగ్గురిలో ఒక్కరికే కన్ఫర్మ్ టికెట్ వచ్చింది. అయినప్పటికీ వారు రైలులోనే ప్రయాణం చేశారు. కొంతసేపు ముగ్గురూ ఒకే సీటులో కూర్చోవాల్సి రావడంతో ప్రయాణం ప్రారంభంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె చెప్పారు.

చివరకు బెర్త్‌ లు దొరకడంతో ఊరట

Advertisement

రాత్రి ప్రయాణం కావడంతో ఎక్కువసేపు ఒకే సీటులో కూర్చోవడం కష్టంగా మారింది. అయితే, కొంత సమయం మరో రెండు బెర్త్‌ లు అందుబాటులోకి రావడంతో ముగ్గురూ సౌకర్యంగా విశ్రాంతి తీసుకునే అవకాశం లభించింది. దీంతో ప్రయాణం మరింత సుఖంగా మారిందని ఎమ్మా చెప్పారు. మొదట ఎదురైన ఇబ్బందులు చివరకు మంచి ఎక్స్ పీరియెన్స్ లభించిందని ఆమె చెప్పారు.

ఆకట్టుకున్న రైలు వాతావరణం  

స్లీపర్ రైలు ప్రయాణంలో కనిపించిన సందడి, ప్రయాణికుల సందోహం, టీ, ఇతర స్నాక్స్ అమ్మే వ్యాపారులు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తనను బాగా ఆకట్టుకున్నారని ఎమ్మా తెలిపారు. ప్రతి బోగీలో సందడి కనిపించడం, అందరూ తమ తమ ప్రయాణంలో నిమగ్నమై ఉండడం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. ప్రయాణం కొన్నిసార్లు గందరగోళంగా అనిపించినప్పటికీ, చివరికి అంతా సవ్యంగానే జరిగించదని ఆమె చెప్పారు. భారత్‌ లో చేసిన తొలి స్లీపర్ రైలు ప్రయాణం తనకు, తన స్నేహితులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు.

ఎమ్మా రివ్యూకు నెటిజన్లు ఫిదా

Advertisement

ఎమ్మా తన ఎక్స్ పీరియెన్స్ ను పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంది. భారతీయ రైల్వే ప్రయాణంలో ఉండే ప్రత్యేకత, సందడి, మనుషుల మధ్య కనిపించే అనుబంధమే విదేశీ పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Read Also:నిండు ప్రాణాన్ని నిలబెట్టిన వందేభారత్, చరిత్రలో తొలిసారి రైల్లో గుండె తరలింపు!

Related News

నిండు ప్రాణాన్ని నిలబెట్టిన వందేభారత్, చరిత్రలో తొలిసారి రైల్లో గుండె తరలింపు!

ప్రమాదంలో పాలపిట్ట.. రాష్ట్ర పక్షి ఇక కంటికి కనిపించదా?

దుబాయ్ ఫ్యామిలీ టూర్ వెళుతున్నారా? పిల్లలకు వీసా ఫ్రీ.. ఈ కండీషన్స్ పాటిస్తే

విశాఖ టు భోగాపురం.. బస్సుకు రూ.300, క్యాబ్‌కు రూ.1,500.. వామ్మో ఇదేం బాదుడురా అయ్యా!

ఆగస్టు 17 నుంచే భోగాపురం ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఏ నగరానికి ఎన్ని ఫ్లైట్స్ అంటే?

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎందుకంత ప్రత్యేకం? మీకు తెలియని ఇంట్రస్టింగ్ విశేషాలు ఇవే!

భోగాపురమే కాదు, ఇండియాలోని ఈ ఎయిర్‌పోర్టులూ సిటీకి దూరమే.. ఎంత టైమ్ పడుతుందంటే?

Big Stories

Advertisement
×