E-Paper
Advertisement

‘నా వయసు 15 ఏళ్లే.. నన్ను క్షమించండి’.. మోదీ విషయంలో యువతి యూటర్న్!

‘నా వయసు 15 ఏళ్లే.. నన్ను క్షమించండి’.. మోదీ విషయంలో యువతి యూటర్న్!
Advertisement

Teen Girl Apologizes: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యువతి.. అందుకు పశ్చాత్తాపం పడుతూ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో సదరు యువతి చేతులు జోడించి మరి ప్రధానికి క్షమాపణలు చెప్పారు. నిరసనకారుల ప్రభావానికి లోనై.. తాను మోదీకి వ్యతిరేకంగా అనరాని మాటలు అన్నట్లు పేర్కొన్నారు. తన వయసు 15 ఏళ్లేనని.. కానీ క్షమించరాని మాటలు మాట్లాడానని వాపోయారు.

ఇదే తన మెుదటి.. చివరి తప్పు అంటూ వీడియోలో బహిరంగ క్షమాపణలు చెప్పారు. ‘నేను దేశం మెుత్తానికి క్షమాపణలు చెబుతున్నా. నాకు చాలా సిగ్గుగా ఉంది. నన్ను నేను చూసుకోలేకపోతున్నా. దయచేసి నన్ను క్షమించండి’ అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దీనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కేసుల భయంతోనే ఆ యువతి ఇలా క్షమాపణలు చెబుతూ వీడియో చేసిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఇటీవల జంతర్ మంతర్ వద్ద మోదీపై సదరు యువతి చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో కొందరు బీజేపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుకో నోయిడా పోలీసులు ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం దానిని దిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ కు బదిలి చేశారు. అందులో యువతి వయసు 25 ఏళ్లుగా పేర్కొనగా.. తాజా వీడియోలో ఆమె తన ఏజ్ 15 మాత్రమే అని పేర్కొనడం గమనార్హం.

Advertisement

Also Read: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈసారి ఎంతంటే?

ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియోలో ప్రధాని మోదీ.. నిరసనల సందర్భంగా తనపై వచ్చిన దూషణల గురించి మాట్లాడారు. తిట్లు ఎప్పటికీ దేనినీ పరిష్కరించలేవని ఆయన వ్యాఖ్యానించారు. దారి తప్పిన వారిని శిక్షించడం కాకుండా.. మార్గనిర్దేశం చేయాలని ఆయన సూచించారు. ‘జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘటనలు దేశంతో పాటు యావత్ ప్రపంచం చూశాయి. తప్పుదారి పట్టిన కొందరు యువత.. సమాజానికి ఏమాత్రం అమోదయోగ్యం కానీ భాషను ఉపయోగించారు. నాతో పాటు నా తల్లిని దూషించారు’ అని మోదీ చెప్పుకొచ్చారు.

Also Read: Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కక్కుర్తి.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్.. మీనాకు ఘోర అవమానం..

Tags

Related News

45 ఏళ్ల క్రితం నాటి దొంగను పట్టించిన ఏఐ ఫోటో.. ఎలానో తెలిస్తే మీరు షాకవ్వడం కాయం!

ప్రధాని మోదీ జన్మదిన వేళ ఎంపీ డీకే అరుణ సంచలన పిలుపు!

యూపీఐ ఉచిత సేవలకి ఎండ్ కార్డ్? మోదీ సర్కార్ నిర్ణయంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

24 క్యారెట్ల బంగారు పూతతో.. గణపయ్యకు కుడుములు.. కేజీ ఏకంగా రూ.27,000 బాబోయ్!

డిజిటల్ చెల్లింపులపై కొత్త టాక్స్.. సామాన్యుడికి మోదీ సర్కార్ దెబ్బ!

ఓ వైపు చీప్ పబ్లిసిటీ.. మరోవైపు ఘనంగా వేడుకలు.. తమిళనాట గణేశ్ ఉత్సవాలు అదరహో!

బిచ్చగాడిగా మారిన ఎమ్మెల్యే పరాగ్.. వేల కోట్లకు అధిపతి, అసలు కారణమేంటి?

పబ్లిసిటీకి వెళ్లాడు.. హోటల్ ఓనర్ అరెస్ట్, బిర్యానీ ప్రకటనలో గణేశుడు

Big Stories

Advertisement
×