E-Paper
Advertisement

జియో కస్టమర్లకు లక్కీ ఛాన్స్.. 365 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2.5GB డేటా.. ఉచితంగా Gemini Pro!

జియో కస్టమర్లకు లక్కీ ఛాన్స్.. 365 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2.5GB డేటా.. ఉచితంగా Gemini Pro!
Advertisement

Jio Annual Plans: ఛా.. మళ్లీ రీఛార్జ్ అయిపోయిందా? అని ప్రతినెలా విసుక్కోవడం మనలో చాలామందికి అలవాటే. దీని కోసం నెలాఖరు రాగానే ప్లాన్ ముగిసిపోతుందని కంగారుపడే పని లేకుండా, ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదంతా ప్రశాంతంగా ఉండేలా జియో మంచి ప్లాన్లను తెచ్చింది. రోజూ మాట్లాడుకోవడానికి అన్‌లిమిటెడ్ కాల్స్, కావలసినంత ఇంటర్నెట్ డేటాతో పాటు ఉచితంగా సినిమాలు చూసేందుకు ఓటీటీలు, వాడుకోవడానికి AI సేవలు కూడా ఈ ఒక్క రీఛార్జ్‌తోనే వచ్చేస్తాయి.

ఏఐ టూల్ కూడా ఫ్రీ:

రోజువారీ ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉండే వారికి రూ.3,599 ప్లాన్ పర్‌ఫెక్ట్ ఆప్షన్. దీనిలో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 100 SMSలు వస్తాయి. 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నచోట ఎంతైనా 5G డేటా వాడుకోవచ్చు. ఇవి కాకుండా మూడు నెలల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 50GB జియో క్లౌడ్ స్టోరేజ్, అలాగే ఏకంగా 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో సేవలు ఉచితంగా లభిస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, ఎక్కువ కంటెంట్ స్ట్రీమ్ చేసేవారికి ఇది సరిపోతుంది.

Advertisement

Also Read: వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

ఏడాది మొత్తానికి ఒక్కటే రీఛార్జ్:

ఇంకా ఎక్కువ ప్రయోజనాలు, ఓటీటీ ఆఫర్లు కావాలనుకునే వారికి రూ.3,999 ప్లాన్ ఉంది. ఇందులో ఏడాది వ్యాలిడిటీతో పాటు ప్రమోషన్లను బట్టి మరిన్ని అదనపు డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు అందుతాయి. ఒకవేళ బడ్జెట్ కాస్త తక్కువ ఉండి, ఏడాదికి దగ్గరగా ఉండే ప్లాన్ కావాలనుకుంటే రూ.3,336 ప్లాన్ ఎంచుకోవచ్చు. ఇది 336 రోజుల వ్యాలిడిటీతో అన్‍లిమిటెడ్ కాల్స్, రోజువారీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది.

ఉచితంగా ప్రముఖ ఓటీటీలు:

Advertisement

మీకు ఇంటర్నెట్ కంటే ఎక్కువ సమయం మాట్లాడడమే ముఖ్యమైతే రూ.2,025 ప్లాన్ మంచి ఎంపిక. ముఖ్యంగా వైఫై ఎక్కువగా వాడేవారికి, లేదా సెకండరీ సిమ్ వాడుతున్న వారికి ఇది చాలా పొదుపైన మార్గం. ఇందులో ఏడాది పొడవునా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు అవసరానికి సరిపడా డేటా లభిస్తుంది. మీ అవసరానికి తగ్గట్టుగా సరైన ప్లాన్ ఎంచుకుంటే ఏడాది అంతా నిశ్చింతగా ఉండొచ్చు.

Also Read: 25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

Related News

జియో సెన్సేషనల్ ఆఫర్.. ఫ్రీగా ‘కాన్వా ప్రో’ సేవలు.. డిజైనర్ అవ్వడం ఇక చాలా ఈజీ!

యూట్యూబ్ సంపాదన ఇక మరింత టఫ్..కొత్త నిబంధనల పూర్తి వివరాలు!

గూగుల్ మ్యాప్స్ అమేజింగ్ ఫీచర్..మీ పార్కింగ్ లొకేషన్ ఇక ఎప్పటికీ మర్చిపోరు!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!

మీ డేటా సేఫ్‌గా ఉండాలా? ChatGPTలో ఈ ఒక్కటి ఆఫ్ చేయండి చాలు!

రూ.54,999 ఫోన్ ఇప్పుడు ఇంత తక్కువకా? Vivo Y51 Pro 5Gపై క్రేజీ ఆఫర్!

iPhone 17 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 వరకు ఆదా చేసుకునే ఛాన్స్!

QR స్కాన్ అవసరం లేదు.. ట్యాప్ చేస్తే చాలు, UPIలో కొత్త పేమెంట్ ఫీచర్!

Big Stories

Advertisement
×