E-Paper
Advertisement

జియో అదిరిపోయే ఆఫర్.. రూ.111, రూ.459 రీఛార్జ్‌లపై.. ఫ్రీగా స్నాప్‌చాట్ సబ్‌స్క్రిప్షన్!

జియో అదిరిపోయే ఆఫర్.. రూ.111, రూ.459 రీఛార్జ్‌లపై.. ఫ్రీగా స్నాప్‌చాట్ సబ్‌స్క్రిప్షన్!
Advertisement

Jio Recharge Plans: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు డేటాతో పాటు స్నాప్ చాట్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా అందించేందుకు రిలయన్స్ జియో రెండు సరికొత్త రీఛార్జ్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.111, రూ.459 ధరల్లో వివిధ రకాల ప్రయోజనాలతో యూజర్లను సర్ ప్రైజ్ చేసింది. ఈ ప్లాన్లకు సంబంధించిన వివరాలు, దీనిని రీఛార్జ్ చేసుకోవడం వల్ల యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

రూ. 111 రీఛార్జ్ ప్లాన్ (యూత్ ప్యాక్)

ఈ ప్లాన్ ను జియో 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. స్నాప్ చాట్ సబ్ స్క్రిప్షన్ తో పాటు 5GB డేటాను సైతం ఈ ప్లాన్ లో ఆఫర్ చేస్తోంది. అయితే ఇది డేటా వోచర్ మాత్రమేనని జియో స్పష్టం చేసింది. దీనిని పొందాలంటే ఏదైనా ప్రీపెయిడ్ ప్లాన్ మెుబైల్లో యాక్టివ్ గా ఉండాలని తెలియజేసింది. దీనిలో ప్రత్యేకంగా అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు ఉండవని వివరించింది. మరోవైపు రూ.111 ధరకే గేమింగ్ ప్యాక్ ను సైతం జియో అందిస్తోంది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే 56 రోజుల పాటు ‘జియోగేమ్స్ మొబైల్’ (JioGames Mobile) యాక్సెస్ లభించనుంది. కానీ ఇందులో స్నాప్ చాట్ ప్లస్ సేవలు లభించకపోవడం గమనార్హం.

జియో రూ. 459 రీఛార్జ్ ప్లాన్

Advertisement

స్నాప్ చాట్ ప్లస్ సబ్ స్క్రిప్షన్ తోపాటు డేటా, ఫ్రీకాల్స్ కోరుకునేవారి కోసం జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఇది కూడా 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు యూజర్లకు లభిస్తాయి. అంతేకాకుండా రోజువారీ డేటా తోపాటు అదనంగా మరో 5 జీబీ డేటాను సైతం జియో ఆఫర్ చేస్తోంది. దీనిని కూడా కలుపుకుంటే ప్లాన్ వ్యవధి పూర్తయ్యే సరికి యూజర్లకు 61GB డేటా లభించనుంది. దీంతో పాటు కాన్వా ప్రో లైట్ 12 నెలల సబ్ స్క్రిప్షన్, మై జియో యాప్ యాక్సెస్ సైతం యూజర్లు పొందొచ్చు.

Also Read: BSNL ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్.. జస్ట్ రూ.1 కే 24 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ డేటా, ఫ్రీ కాల్స్!

ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే బెటర్?

Advertisement

ఈ రెండు ప్లాన్లలో స్నాప్ చాట్ ప్లస్ సబ్ స్క్రిప్షన్, వ్యాలిడిటీ మినహా మిగతా అన్నిట్లో భిన్నమైన బెనిఫిట్స్ ను కలిగి ఉన్నాయి. మీ వద్ద ఇప్పటికే యాక్టివ్ ప్లాన్ ఉండి, అదనపు డేటా, స్నాప్‌చాట్ ప్లస్ కావాలనుకుంటే రూ. 111 డేటా వోచర్ తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. అలాకాకుండా పూర్తి స్థాయి ప్లాన్ కింద డేటా, ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ఎస్ లు, కాన్వా ప్రో లైట్ సబ్ స్క్రిప్షన్ కోరుకుంటే రూ. 459 ప్లాన్ ట్రై చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: వారంటీ vs గ్యారంటీ.. రెండింటికి తేడా ఏంటి? దేని వల్ల మనకి ఎక్కువ లాభం?

Tags

Related News

BSNL ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్.. జస్ట్ రూ.1 కే 24 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ డేటా, ఫ్రీ కాల్స్!

రూ.7,190కే 5 స్టార్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు చూస్తే మతిపోతుంది!

రూ.749కే ‘హామర్ వేవ్’బ్లూటూత్ స్పీకర్..ఫీచర్లు చూస్తే అస్సలు వదలరు!

రూ.999కే 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో..ఇయర్ బడ్స్,డోంట్ మిస్

తక్కువ ధరలో..స్టైలిష్ లుక్స్‌తో సరికొత్త స్పీకర్,సౌండ్ నెక్స్ట్ లెవెల్!

బిగ్,బోల్డ్ డిజైన్‌తో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ లాంచ్..పూర్తి ఫీచర్లివే!

ప్రైస్ తక్కువ..ఫీచర్లు ఎక్కువ,ఈ ఇయర్ యూత్ మోస్ట్ వాంటెడ్ స్మార్ట్‌వాచ్ ఇదే!

Big Stories

Advertisement
×