E-Paper
Advertisement

రాప్తాడు ఘటన వ్యవహారం.. ఆసుపత్రి నుంచి నిందితుడు డిశ్చార్జ్, పోలీసుల విచారణ మొదలు

రాప్తాడు ఘటన వ్యవహారం..  ఆసుపత్రి నుంచి నిందితుడు డిశ్చార్జ్,  పోలీసుల విచారణ మొదలు
Advertisement

Raptadu Incident: ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు నిందితుడు హేమంత్‌ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్ఛార్జ్ చేశారు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితుడ్ని అనంతపురం జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.

రాప్తాడు ఘటన వ్యవహారం

అనంతపురం జిల్లా రాప్తాడు విద్యార్థిని దాడి కేసు దర్యాప్తు వేగంగా జరగనుంది. కేసు నిందితుడు హేమంత్‌ను ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్ఛార్జ్ చేశారు. దీంతో కర్నూలు ఆసుపత్రి నుంచి భద్రత మధ్య అనంతపురం జిల్లా జైలుకి తరలించారు. అనారోగ్య సమస్యల కారణంగా ఈనెల 13న చికిత్స కోసం అనంతపురం నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్డియాలజీ విభాగంలో చికిత్స అందించారు.

 ఆసుపత్రి నుంచి అనంతపురం జిల్లా జైలుకు నిందితుడు

Advertisement

రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేశాడు నిందితుడు హేమంత్. అడ్డు వచ్చిన మరొక విద్యార్థినిపై కూడా దాడి చేశాడు. ప్రస్తుతం ఇద్దరు బాధిత విద్యార్థునులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఘటన తర్వాత పరారీలో ఉన్నాడు నిందితుడు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వాడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో పోలీసులపై దాడి చేశాడు. ఆ ప్రాంతం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరపారు.

ALSO READ: ఈవీఎం లేదా బ్యాలెట్.. ఏదైనా ప్రజల మద్దతు కూటమికే.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, కూటమి నేతల క్లారిటీ

Advertisement

నిందితుడి మోకాలిపై తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన ప్రాంతం నుంచి చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు తీసుకొచ్చారు. నాలుగు రోజులుగా కార్డియాలజీ ఐసీయూలో చికిత్స పొందాడు నిందితుడు హేమంత్. బీపీ, పల్స్ రేటు సాధారణ స్థితికి వచ్చాయని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.

కాలికి గాయం పూర్తిగా మానిందని వెల్లడించారు. హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై ఓ నివేదికను రెడీ చేసి అనంతపురం జిల్లా న్యాయాధికారికి పంపనున్నట్లు తెలిపారు. రేపో మాపో నిందితుడ్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

 

Related News

ఈవీఎం లేదా బ్యాలెట్.. ఏదైనా ప్రజల మద్దతు కూటమికే.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, కూటమి నేతల క్లారిటీ

రూటు మార్చిన వైసీపీ.. బీజేపీని టార్గెట్ చేస్తూ, మంత్రి సత్యకుమార్‌పై పేర్ని నాని విసుర్లు

ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగ.. బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేలు, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీ మైనర్ అనుమానాస్పదంగా మృతి, విజయవాడ లాడ్జీలో ఏం జరిగింది?

అర్ధరాత్రి పెను విషాదం.. ఆ గ్రామంలో భారీ అగ్నిప్రమాదం, ప్రకాశం జిల్లాలో ఘటన

దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్, బలమైన గాలులు మొదలు

ఏపీ కాంట్రాక్టు ఉద్యోగాల జాబ్ స్కామ్‌లో.. మేడ్చల్ ప్రాంత లింకులు..?

Big Stories

Advertisement
×