E-Paper
Advertisement

పులివెందులలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి, పలువురికి గాయాలు

పులివెందులలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి, పలువురికి గాయాలు
Advertisement

Pulivendula: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రాజకీయ వేడిని రాజేసింది. పలు ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య మొదలైన మాటల యుద్ధం కాస్తా ఘర్షణలకు దారితీసింది. కడప జిల్లా పులివెందుల, ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గాల్లో జరిగిన దాడులు, తోపులాటలతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పులివెందులలో రాళ్ల దాడి.. పలువురికి గాయాలు

Advertisement

పులివెందుల నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో నామినేషన్ల వేళ హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లెలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తలెత్తిన వివాదం ముదిరి పరస్పరం రాళ్ల దాడికి దారితీసింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు, వేంపల్లి మండలం అలవలపాడు క్లస్టర్ పరిధిలో తమ అభ్యర్థులు, మహిళలు, సానుభూతిపరులను నామినేషన్లు వేయకుండా పోలీసులు, టీడీపీ శ్రేణులు అడ్డుకుని దాడులకు పాల్పడ్డాయని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.

దర్శిలో తోపులాట.. అప్రమత్తమైన పోలీసులు

Advertisement

అటు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోనూ ఇదే తరహా ఉద్రిక్తత చోటుచేసుకుంది. దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామంలోని నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎదురుపడటంతో తొలుత తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై, ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ ఎందుకు?: రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tags

Related News

రాప్తాడు ఘటన వ్యవహారం.. ఆసుపత్రి నుంచి నిందితుడు డిశ్చార్జ్, పోలీసుల విచారణ మొదలు

ఈవీఎం లేదా బ్యాలెట్.. ఏదైనా ప్రజల మద్దతు కూటమికే.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, కూటమి నేతల క్లారిటీ

రూటు మార్చిన వైసీపీ.. బీజేపీని టార్గెట్ చేస్తూ, మంత్రి సత్యకుమార్‌పై పేర్ని నాని విసుర్లు

ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగ.. బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేలు, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీ మైనర్ అనుమానాస్పదంగా మృతి, విజయవాడ లాడ్జీలో ఏం జరిగింది?

అర్ధరాత్రి పెను విషాదం.. ఆ గ్రామంలో భారీ అగ్నిప్రమాదం, ప్రకాశం జిల్లాలో ఘటన

దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్, బలమైన గాలులు మొదలు

Big Stories

Advertisement
×