E-Paper
Advertisement

అన్నపూర్ణ స్టూడియోలో ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ గేమ్ చిత్రీకరణ.. పూర్తి వివరాలు ఇవే!

అన్నపూర్ణ స్టూడియోలో ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ గేమ్ చిత్రీకరణ.. పూర్తి వివరాలు ఇవే!
Advertisement

The Age of Bharat Game: ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ అనే ప్రతిష్టాత్మక AAA వీడియో గేమ్ మోషన్ క్యాప్చర్ చిత్రీకరణ.. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరుగుతోంది. నవంబర్ 18 2026న అధికారికంగా ప్రకటించిన ఈ భాగస్వామ్యం ద్వారా నిజమైన నటుల కదలికలను, గేమ్ లోని డిజిటల్ యాక్షన్ సన్నివేశాలు మారుస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా అన్నపూర్ణ స్టూడియోస్ పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ది ఏజ్ ఆఫ్ భారత్ గేమ్ షూటింగ్..

దేశంలోని అతిపెద్ద వేదిక అయిన హాలీవుడ్ టెక్నాలజీ సంస్థ ‘యానిమాట్రిక్ ఫిలిం డిజైన్’ సహకారంతో వైఖాన సిరీస్ కెమెరాలతో కూడిన మోషన్ క్యాప్చర్ స్టేజ్ మీద ఈ గేమ్ షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ నటుల శరీర కదలికలు, ముఖ కవళికలు, రియల్ టైం యానిమేషన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ , మిహిరా విజువల్ ల్యాబ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక మోషన్ క్యాప్చర్ స్టేజ్ లో గేమ్ షూటింగ్ జరుగుతుండడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఇదే ల్యాబ్ లో గతంలో వారణాసి, బాహుబలి : ఎటర్నల్ వార్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులు కూడా జరగడం గమనార్హం. భారతీయ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా స్థానిక ప్రతిభను , మౌలిక సదుపాయాలను ఈ ప్రాజెక్టులో వినియోగిస్తున్నారు.

తార గేమింగ్ సంస్థ నిర్మాణంలో ది ఏజ్ ఆఫ్ భారత్

Advertisement

ది ఏజ్ ఆఫ్ భారత్ గేమ్ విషయానికి వస్తే.. బాలీవుడ్ మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్, ప్రముఖ రచయిత అమీషా త్రిపాటి, గేమ్ నిర్మాత నౌ రెడీన్ అబ్బౌద్ కలిసి స్థాపించిన తారా గేమింగ్ సంస్థ ద్వారా ఈ ఏజ్ ఆఫ్ భారత్ గేమ్ ను నిర్మిస్తున్నారు. ఇది భారతీయ పురాణాలు , ఇతిహాసాల ఆధారంగా రూపొందుతున్న మొదటి డార్క్ ఫాంటసీ AAA యాక్షన్ అడ్వెంచర్ గేమ్ అని చెప్పవచ్చు. ఇందులో ఆటగాళ్లు ‘ఫారెస్ట్ వార్డెన్’ పాత్రలో సాంప్రదాయ భారతీయ ఆయుధాలు, ఆధ్యాత్మిక శక్తులు, గ్రాప్లింగ్ హుక్ సహాయంతో రాక్షస సైన్యంతో పోరాడతారు. ఇందులో సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 205 మందికి పైగా నిపుణులతో రియల్ ఇంజన్ పై దీనిని రూపొందిస్తున్నారు.

గ్రాప్లింగ్ హుక్ సిస్టం తో ఆట మరింత ఆసక్తిగా..

ఈ గేమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఉపయోగించే గ్రాప్లింగ్ హుక్ సిస్టం కారణంగా ప్లేయర్లు గాల్లో ఎగురుతూ పోరాడవచ్చు. దట్టమైన అడవులు, పర్వత శిఖరాలు, సరస్సులను వేగంగా దాటడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ గేమ్ ను ఒంటరిగా లేదా స్నేహితులతో కలిసి ఇద్దరు కలిసి ఆడే కో ఆప్ సదుపాయం కూడా కలిగించారు . భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని.. ఆధునిక గేమింగ్ సౌండ్స్ తో మేళవిస్తూ సాయి శ్రవణం, మాక్సిన్ హెర్వే ఈ గేమ్కు సంగీతం అందిస్తున్నారు. గత ఏడాది ఆఖరిలో ఈ గేమ్ ట్రైలర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

గేమ్ స్టోరీ:

Advertisement

ఈ గేమ్ స్టోరీ విషానికి వస్తే ది ఏజ్ ఆఫ్ భారత్ లో ఫారెస్ట్ వార్డెన్ ది మెయిన్ రోల్. ఈ పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. ఇందులో ఆనంద్ పూర్ అనే కల్పిత ప్రదేశం ఉంటుంది. దాన్ని ఆక్రమించుకోవడానికి రాక్షసులు దండెత్తి వస్తుంటారు. వారి నుంచి ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు వీరోచిత పోరాటం చేస్తుంటాడు ఫారెస్ట్ వార్డెన్. విధి నిర్వహణ, ద్రోహం, నైతిక నిర్ణయాలు వంటివి ఇందులో ప్రధాన అంశాలుగా ఉంటాయి. ముఖ్యంగా ఈ గేమ్ లో ఆటగాళ్లు తీసుకునే నిర్ణయాలు గేమ్ స్టోరీ ఎండింగ్ ను ప్రభావితం చేస్తాయి.

also read: రాజ్ ఫ్యామిలీతో సమంత స్పెషల్ సీమంతం వేడుక..ఫొటోస్ వైరల్ !

విడుదల ఎప్పుడు?

ఇకపోతే ఈ గేమ్ ఎప్పుడు లాంగ్ చేస్తారనేది కంపెనీ స్పష్టంగా ప్రకటించలేదు కానీ 2026 చివరి నాటికి పిసి అండ్ కన్సోల్స్ లో లాంచ్ చేస్తామని కంపెనీ వెల్లడించింది ఆసక్తి ఉన్నవారు స్టీమ్, ఎపిక్ గేమ్స్ స్టోర్ లోని విష్ లిస్ట్ కి దీనిని యాడ్ చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది.

Related News

ఈ రోజే బిడ్డకు జన్మనివ్వచ్చేమో..సమంత పోస్ట్ వైరల్!

రాజ్ ఫ్యామిలీతో సమంత స్పెషల్ సీమంతం వేడుక..ఫొటోస్ వైరల్ !

ఆసక్తికరంగా మోసపోయాం జానకి.. సందీప్ రెడ్డి వంగ స్పెషల్ ప్రమోషన్!

తరుణ్ కి ఈషా సరైన జోడీ.. పెళ్లి పై తల్లి క్లారిటీ!

‘కాకా ‘ ఓకే.. ‘విశ్వంభరా’ పరిస్థితి ఏంటి..?

పూజా హెగ్డే ఒక్కనెలకు అంత సంపాదిస్తుందా..? సినిమా కన్నా ఎక్కువ..

మహేష్ బాబు సినిమాకు వివాదాలు తప్పవా? వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్!

Big Stories

Advertisement
×