E-Paper
Advertisement

Tiruchanur: తిరుచానూరు ఆలయంలో రథసప్తమి మహోత్సవాలు.. తేదీ, కార్యక్రమాల వివరాలు ఇవే..

Tiruchanur: తిరుచానూరు ఆలయంలో రథసప్తమి మహోత్సవాలు.. తేదీ, కార్యక్రమాల వివరాలు ఇవే..
Advertisement

Rathasaptami Festival Tiruchanur: తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయం తిరుచానూర్ పద్మావతి ఆలయం జనవరి 25న రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

రథసప్తమి పర్వదినం సందర్బంగా.. పద్మావతి ఏడు వాహనాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అంతకు ముందు వేడుకల్లో భాగంగా జనవరి 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

కార్యక్రమాల వివరాలు..

జనవరి 25 ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గరుడ వాహనంపై విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై ద‌ర్శ‌న‌మిస్తారు.

Advertisement

సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని.. శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, కుంకుమార్చ‌న‌, బ్రేక్ ద‌ర్శ‌నం, ఊంజ‌ల‌ సేవ, వేదాశీర్వచనంలను టీటీడీ రద్దు చేసింది.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనము ఉంటుంది.

Also Read: కోనసీమలో ఆరని గ్యాస్ లీక్ మంటలు.. అంతర్జాతీయ నిపుణులతో ఓఎన్‌జీసీ సంప్రదింపులు

రథసప్తమి పర్వదినాన్ని పురష్కరించుకుని తిరుచానూర్ లో భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×