BigTV English

AP Trains Cancelled: ఏపీపై కన్నెర్ర చేసిన వరుణుడు.. ఏడుగురు మృతి.. 20 రైళ్లు రద్దు

AP Trains Cancelled: ఏపీపై కన్నెర్ర చేసిన వరుణుడు.. ఏడుగురు మృతి.. 20 రైళ్లు రద్దు

Trains Cancelled in Vijayawada Region: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేటి అర్థరాత్రికి విశాఖపట్నం – గోపాల్ పూర్ మధ్య కళింగపట్నానికి దగ్గరలో వాయుగుండం తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరాన్ని సమీపించే కొద్దీ వర్షాల తీవ్రత పెరుగుతుందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై వరదనీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజా టోల్ ప్లాజా వద్ద, విజయవాడ గుంటూరు హైవే పై భారీగా వరదనీరు నిలిచిపోయింది. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. విజయవాడ బస్టాండ్ వద్ద మోకాలి లోతు వరదనీరు నిలిచిపోయింది. వన్ టౌన్ రీజియన్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతుండటంతో.. ఘాట్ రోడ్డును మూసివేశారు.

మరోవైపు గుంటూరుజిల్లాలోనూ వరద పోటెత్తింది. వరదనీటిలో కారు కొట్టుకుపోవడంతో టీచర్, ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. భారీవర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.


Also Read: విజయవాడలో విషాదం.. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి

ఏపీలో పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

భారీవర్షాల నేపథ్యంలో విజయవాడ డివిజన్ లో 20 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే

07279 – విజయవాడ టు తెనాలి – సెప్టెంబర్ 1

07575- తెనాలి టు విజయవాడ – సెప్టెంబర్ 1

07500 – విజయవాడ టు గూడూరు – ఆగస్టు 31

07458 – గూడూరు టు విజయవాడ – సెప్టెంబర్ 1

17257 – విజయవాడ టు కాకినాడ పోర్ట్ – ఆగస్టు 31

07874 – తెనాలి టు రేపల్లె – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07875 – రేపల్లె టు తెనాలి – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07869 – మచిలీపట్నం టు గుడివాడ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07868 – గుడివాడ టు మచిలీపట్నం – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07885 – భీమవరం జంక్షన్ టు నిడదవోలు – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07886 – నిడదవోలు టు భీమవరం జంక్షన్ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07281 – నర్సాపూర్ టు గుంటూరు – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07785 – రేపల్లె టు గుంటూరు – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07976 – గుంటూరు టు విజయవాడ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

17269 – విజయవాడ టు నర్సాపూర్ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07576 – ఒంగోలు టు విజయవాడ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07898 – విజయవాడ టు మచిలీపట్నం – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07899 – మచిలీపట్నం టు విజయవాడ – సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2

07461 – విజయవాడ టు ఒంగోలు – సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.

ఇదిలా ఉండగా.. ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 3.24 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాల్వలలోకి 3507 క్యూసెక్కుల నీటిని వదిలారు.

Related News

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Big Stories

×