BigTV English

CM Chandrababu: అది పనికిమాలిన పిటిషన్ – సీఎం చంద్రబాబు కేసుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: అది పనికిమాలిన పిటిషన్ – సీఎం చంద్రబాబు కేసుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.


పిటిషనల్ బాలయ్య తరఫు న్యాయవాది మణీందర్ సింగ్‌పై ధర్మాసనం అగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక పనికి మాలిన పిటిషిన్ అని, దీనిమై మరోసారి ఒక్క మాట మాట్లాడిన భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంటుందని మందలించింది. ఈ కేసును వాదించాడిని అసలు ఎలా వచ్చారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. చంద్రబాబు ప్రస్తుతం సీఎంగా ఉన్నారని కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ.. దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. కనీసం ఒక్క మాట కూడా వినకుండా సుప్రీం డిస్మిస్ చేసి ఫైర్ అయ్యింది. ఇది అసలు పనికి రాని పిటిషన్ అంటూ జస్టిస్ బేలాయం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం చెప్పుకొచ్చింది. సీఐడీ నమోదు చేసిన ఏడు కేసులు సీబీఐకి బదిలీ చేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాది బీ బాలయ్య పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: Telangana BJP: తెలంగాణలో బీజేపీ ప్లాన్ ఇదే.. ఇది మామూలు వ్యుహం కాదు..!!


బాలయ్య తరఫున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ రెడీ అయ్యారు.. అయితే వెంటనే సుప్రీం ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి టైమ్ వేస్ట్ కేసుల్లో మీ లాంటి సీనియర్ వ్యక్తులు అటెంటడ్ అవుతారని అసలు ఊహించలేదని వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా మాట్లాడొద్దంటూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై పలు కేసులు నమోదు అయ్యి.. ఆ వెంటనే నోటీసులచ్చి అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఏడు వారాలకు పైగా చంద్రబాబు జైలులో ఉన్నారు. అనంతరం బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. 2024లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి సీఎం బాధ్యతలు  చేపట్టారు

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×