BigTV English

Balakrishna : నాట్ ఓన్లీ సౌత్… బట్ ఆల్సో నార్త్ ?

Balakrishna : నాట్ ఓన్లీ సౌత్… బట్ ఆల్సో నార్త్ ?

Balakrishna New Movie : పాన్ ఇండియా స్టార్ అవ్వలాంటే నార్త్ మంత్రం చదవాల్సిందే. అందుకే ప్రతి ఒకరు నార్త్ జపం పట్టుకుంటున్నారు. కొంత మంది సక్సెస్ అవుతున్నారు. మరి కొంత మంది బోల్తా పడుతున్నారు. అయితే భక్తి సెంటిమెంట్‌తో సినిమా చేసి, నార్త్ లో రిలీజ్ చేస్తే మాత్రం సక్సెస్ అవుతున్నారు.


అవును… నార్త్ వాళ్లకు భక్తి ఎక్కువ. అందుకే కార్తికేయ 2, హనుమాన్ లాంటి సినిమాలు అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీని తర్వాతే ఇక్కడి భక్తి సినిమాలు అక్కడ రిలీజ్ అవ్వడం మొదలు పెట్టాయని చెప్పొచ్చు. ఇప్పుడు బాలయ్య కూడా అదే నార్త్ మంత్రం చదవబోతున్నాడు. నార్త్ లో సక్సెస్ అయి తన పేరు పక్కన ‘పాన్ ఇండియా స్టార్’ అనే ట్యాగ్ తగిలించుకోవాలని చూస్తున్నాడు. మరి అందుకు బాలయ్య ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్ధాం…

నందమూరి తారక రామరావు తర్వాత జనరేషన్ బాలయ్యది. మొన్నటి వరకు బాలకృష్ణ కోపదారి మనిషి అని ముక్కోపి అని అనేవారు. అందరూ అలానే చూసే వారు. కానీ, ఎప్పుడైతే… టాక్ షో చేయడం మొదలు పెట్టడో… అప్పటి నుంచి ఆయనను చూసి విధానం మారిపోయింది. ఆయన చిన్న హీరోలతో కూడా కలవిడిగా ఉండటం, చిన్న పిల్లల మనస్తత్వం వల్ల అందరికీ కనెక్ట్ అవుతున్నాడు బాలయ్య.


ఇక సినిమాల విషయానికి వస్తే… అఖండ తర్వాత బాలయ్య చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలనే సాధిస్తున్నాయి. ఇటీవల డాకు మహారాజ్ మూవీ కూడా మంచి రిజెల్ట్ ఇచ్చింది. కాగా, ఇప్పుడు బాలయ్య అఖండ 2 మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండకు సీక్వెల్ గా వస్తుంది.

నార్త్ ఆడియన్సే టార్గెట్…

అయితే ఈ మూవీతో నార్త్ ఆడియన్స్‌‌ను టార్గెట్ చేస్తున్నారట బాలయ్య. డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా అదే విధంగా సినిమాను డిజైన్ చేస్తున్నారట. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. మహా కుంభమేళలో నాగ సాధువులతో ఓ కీలక సీన్ కూడా షూట్ చేశాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను.

నార్త్ వాళ్లకు భక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే అఘోరాలు అన్నా… నాగ సాధువులు అన్నా… నార్త్ వాళ్లకు ఎనలేని భక్తి ఉంటుంది. ఇప్పటికే బాలయ్య అఖండ మూవీలో అఘోరా పాత్ర చేశాడు. ఇప్పుడు రాబోయే అఖండ 2లో నాగ సాధువు పాత్రలో బాలయ్య కనిపించబోతున్నట్టు సమాచారం. బాలయ్య పాత్ర అఘోరిలా ఉన్నా.. నాగ సాధువులా ఉన్నా… ఈ సారి నార్త్ వాళ్లకు కనెక్ట్ అవ్వడం మాత్రం పక్కా. అ విధంగానే మూవీని చేస్తున్నారట మరి.

ఇప్పటికే నార్త్ వాళ్లను పలకరించాడు

అలా… ఈ సారి అఖండ 2తో ఎలాగైనా… నార్త్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడు. అందులో భాగంగా.. ఇప్పటికే నార్త్ ఆడియన్స్‌ను పలకరించాడు. డాకు మహారాజ్ మూవీ ఇటీవల హిందీలో రిలీజై మంచి టాక్ కూడా తెచ్చుకుంది. ఈ మూవీతో కాస్త లైన్‌లో పెట్టాడు. ఇప్పుడు రాబోయే అఖండ 2 తో అక్కడ సెటిల్ అయి… పాన్ ఇండియ స్టార్ ట్యాగ్ కొట్టాయాలని చూస్తున్నట్టు ఉంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×