Chhaava : బాలీవుడ్ మూవీ ‘ఛావా’ (Chhaava) ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ మూవీలో విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఇండియాతో పాటు మరో దేశంలో కూడా రిలీజ్ కాబోతోంది అనే గుడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఇండియాతో పాటు రష్యాలో కూడా…
విక్కీ కౌశల్ – రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, యష్ రాజ్ ఫిల్మ్స్ అంతర్జాతీయ స్థాయిలో పంపిణీ చేస్తుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఫిబ్రవరి 14న భారత్‌తో పాటు రష్యాలో కూడా విడుదల కానుంది.
‘ఛావా’ అనేది మరాఠా రాజు శంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చారిత్రక యాక్షన్ చిత్రం. శివాజీ సావంత్ మరాఠీ నవల ‘ఛావా’ ప్రేరణతో రూపొందిన ఈ మూవీలో ఛత్రపతి శివాజీ వారసుడు శంభాజీ మహారాజ్ జీవితాన్ని చూపించనున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నతో పాటు, అక్షయ్ ఖన్నా కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
ఒకేసారి రెండు దేశాలలో రిలీజ్
ఇండియాతో పాటు రష్యాలో కూడా ‘ఛావా’ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ‘ఛావా’ భారతదేశంతో పాటు రష్యాలో కూడా ఒకేసారి విడుదల అవుతుంది. మూవీ ఇలా ఏకకాలంలో రెండు దేశాలలో విడుదల కావడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ చిత్రం రష్యాలో ఎలా ఆడుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.
డ్యాన్స్ సీన్ పై వివాదం
‘ఛావా’లో విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో, రష్మిక మందన్న ఛత్రపతి శంభాజీ మహారాజ్ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ ఖన్నా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గా, అశుతోష్ రాణా సర్సేన్‌పతి హంబిరావ్ మోహితేగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో దివ్య దత్తా సోయారాబాయిగా, డయానా పెంటీ జీనత్-ఉన్-నిసా బేగం (ఔరంగజేబు కుమార్తె) పాత్రలో కనిపించనున్నారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ‘ఛావా’ ట్రైలర్ లో పట్టాభిషేకం తరువాత శంభాజీ డ్యాన్స్ చేస్తున్నట్టు చూపించడం వివాదానికి దారి తీసింది. ఆ సీన్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో మేకర్స్ కొన్ని సీన్లను డిలీట్ చేయాల్సి వచ్చింది.
రష్మిక క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న టీమ్
కూర్గ్ భామ రష్మిక మందన్నకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా రష్యా, జపాన్ వంటి ప్రాంతాల్లో కూడా శ్రీవల్లికి మంచి ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. ‘పుష్ప’ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా గతంలో రష్మిక రష్యాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ‘ఛావా’ను కూడా రష్యాలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం రష్మికనే. అక్కడ ఆమెకున్న క్రేజ్ ను ‘ఛావా’ మేకర్స్ ఇలా క్యాష్ చేసుకుంటున్నారు.