E-Paper
Advertisement

RK Roja: రాయలసీమ ద్రోహి నువ్వు..! చంద్రబాబుపై రోజా ఫైర్

RK Roja: రాయలసీమ ద్రోహి నువ్వు..! చంద్రబాబుపై రోజా ఫైర్
Advertisement

RK Roja: నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని మాజీ మంత్రి రోజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపివేసి చంద్రబాబు ఆప్రాంతానికి వెన్నుపోటు పొడిచారని రోజా ధ్వజమెత్తారు. జగన్ కరువు నివారణకు కృషి చేస్తే, బాబు తన ఆస్తుల రక్షణ కోసం ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అన్యాయం జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

అలాగే దేశంలోనే అట్టడుగు స్థానంలో ఏపీ పోలీస్ శాఖ ఉందని రోజా విమర్శించారు. కేంద్ర నివేదికను చూసి చంద్రబాబు, అనిత సిగ్గుపడాలన్నారు. పోలీస్ వ్యవస్థను చూసి అందరూ నవ్వుతున్నారని పేర్కొన్నారు. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేశ్ తానా అంటే పోలీసులు తందానా అంటున్నారని మండి పడ్డారు.

Advertisement

పోలీసు శాఖ ఖాకీ చొక్క తీసేసి పసుపు చొక్క వేసుకుందని ఆర్కే రోజా ఆరోపించారు. తమ హయాంలో తప్పుడు కేసులు, వేధింపులకు పాల్పడలేదని అన్నారు. తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ తిరిగి ఇస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం నేడు రాష్ట్రంలో గంజాయి వ్యాప్తి, మహిళలపై దాడులు, హత్యా రాజకీయాలు నడుస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. నచ్చని వారిపై తప్పుడు కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని రోజా తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read: మంటల్లో పచ్చని కోనసీమ! అసలు ఎలా జరిగింది.. పాయింట్ టు పాయింట్

Advertisement

రాష్ట్ర పరువును గంగపాలు చేశారని కూటమి ప్రభుత్వంపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంపద అంటూ అప్పులు చేసుకుంటూ పోతున్నారని తీవ్రంగా ఆరోపించారు. నేటితో 3 లక్షల కోట్లు అప్పులు చేశారని.. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం, సంక్షేమం జీరో అంటూ విమర్శలు గుప్పించారు.

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×