Annual Recharge: రీఛార్జ్ ధరలు క్రమంగా పెరుగుతుండటంతో మెుబైల్ యూజర్లు వార్షిక ప్లాన్లపై ఆసక్తికనబరుస్తున్నారు. ప్లాన్ల ధరలు ఎప్పుడు పెరుగుతాయోనన్న టెన్షన్ లేకుండా ఒక్క రీఛార్జ్ తో ఏడాదంతా టెలికాం సేవలు పొందడంపై మెుగ్గు చూపుతున్నారు. దీనికి తోడు డేటా అవసరం లేని యూజర్ల కోసం టెలికాం కంపెనీలు చౌకైన వార్షిస ప్లాన్లను తీసుకొచ్చాయి. కాబట్టి 365 రోజులు సిమ్ యాక్టివ్ గా ఉంచాలని భావించే వారికి ఎయిర్ టెల్, జియో, వీఐ అందిస్తున్న వార్షిక ప్లాన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
ఎయిర్ టెల్ తీసుకొచ్చిన రూ.1849 ప్లాన్.. వార్షిక రీఛార్జ్ కోరుకునేవారికి అత్యంత చౌకైన ఆప్షన్ గా నిలుస్తోంది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లకు 365 రోజుల పాటు హ్యాపీగా ఫోన్స్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఛార్జీ పడదు. మరోవైపు ఈ ప్లాన్ మెుత్తానికి 3600 ఎస్ఎంఎస్ లను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. అడిషనల్ బెనిఫిట్స్ కింద హలో ట్యూన్స్, అడోబ్ ప్రీమియం ఎక్స్ ప్రెస్ 12 నెలల సబ్ స్క్రిప్షన్, ఎయిర్ టెల్ సేఫ్ సేవలు ఉచితంగా లభించనున్నాయి. ఇక ఈ ప్లాన్ లో ఎలాంటి డేటా రాకపోవడం గమనార్హం.
జియో సైతం లాంగ్ వ్యాలిడిటీతో రూ. 1748 చౌకైన ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. 336 రోజులు (సుమారు 11 నెలలు) వ్యాలిడిటీతో యూజర్లకు అపరిమిత ఫ్రీ కాల్స్ అందిస్తోంది. అంతేకాకుండా ఈ ప్లాన్ లో 3600 ఎస్ఎంఎస్ లను సైతం ఆఫర్ చేస్తోంది. అదనపు ప్రయోజనాల కింద జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ స్టోరేజ్ యాప్స్ కు యాక్సెస్ ను సైతం అందిస్తోంది. కాగా, ఈ ప్లాన్ లోనూ ఎలాంటి డేటా యూజర్లకు లభించదు.
Also Read: కార్తీకమాసం ఎఫెక్ట్.. దిగొస్తున్న చికెన్ ధరలు, భగ్గుమన్న కూరగాయల ధరలు
మరోవైపు వీఐ వార్షిక రీఛార్జ్ ల విభాగంలో రూ.1849 ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. దీని కింద యూజర్లకు అపరిమిత ఫ్రీ కాల్స్, 3600 ఎస్ఎంఎస్ లు లభించనున్నాయి. అయితే ఇందులోనూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని వీఐ ఆఫర్ చేయడం లేదు. కాబట్టి డేటా అవసరైన యాడ్ ప్యాక్ ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని వీఐ వర్గాలు తెలిపాయి.
Also Read: జియోలో దుమ్మురేపే ఫ్యామిలీ ప్లాన్.. రూ.749కే 100GB, అపరిమిత 5G, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్!