E-Paper
Advertisement

అంతరిక్షంలోకి వెళ్లాలనే అమ్మాయి కల..ఆసక్తికరంగా డియర్ ఆస్ట్రోనాట్ ట్రైలర్!

అంతరిక్షంలోకి వెళ్లాలనే అమ్మాయి కల..ఆసక్తికరంగా డియర్ ఆస్ట్రోనాట్ ట్రైలర్!
Advertisement

Dear Astronut Trailer:  ఇటీవల కాలంలో ప్రేమ కథ సినిమాల కంటే కూడా ఎంతో విభిన్నమైన కథా చిత్రాల పట్ల ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే .ఇలా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఎన్నో విభిన్నమైన జానర్ లో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇకపోతే అంతరిక్షం, రాకెట్స్ వంటి జోనర్ లో ఇదివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ఇలాంటి నేపథ్యంలోనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సౌమిత్ రావు (Sowmith రావు), శ్రేయసి సేన్(shreyasi sen ) జంటగా నటించిన తాజా చిత్రం డియర్ ఆస్ట్రోనాట్ (Dear Astronut).

ఆసక్తికరంగా డియర్ ఆస్ట్రోనాట్ ట్రైలర్..

కార్తీక్ భాగ్యరాజ దర్శకత్వంలో యువన్‌కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, మనస్విని భాగ్యరాజ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాలో సౌమిత్, శ్రేయసి సేన్ జంటగా నటిస్తున్నారు.కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి పలు పాటలను, టీజర్ విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇకపోతే ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కల్పనా చావ్లా స్ఫూర్తితో..

Advertisement

ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం చనిపోయిన తన అమ్మ ఆకాశంలోకి వెళ్తే ఎలాగైనా అంతరిక్షంలోకి వెళ్లి తన అమ్మని చూడాలని చిన్నప్పటినుంచి కలలు కనే ఒక అమ్మాయి పెద్దయిన తర్వాత కూడా అదే లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది.ఇలా చిన్నప్పటి నుంచి కల్పనా చావ్లా స్ఫూర్తితో అంతరిక్షంలోకి వెళ్లాలని  కలలు కనే ఒక అమ్మాయి ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మరి ఈ ప్రయాణంలో అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? తన ఇబ్బందులను దాటుకొని అంతరిక్షంలోకి వెళ్లిందా? తనకలను నెరవేర్చుకున్నారా లేదా అనేదే ఈ సినిమా ట్రైలర్ ద్వారా చూపించారు.

Advertisement

ఇక ఈ ట్రైలర్ వీడియోస్ చూస్తుంటే మాత్రం ఎంతో ఎమోషనల్ గా, ఈ సినిమా కథ కొనసాగుతుంది తెలుస్తుంది. ఇలా బిన్నమైన కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి కలలుకనే అమ్మాయి పెళ్లి తర్వాత తన కళలను సహకారం చేసుకునే నేపథ్యంలో తన భర్త మద్దతు ఎంత అవసరమో ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. మరి నవంబర్ 20 వ తేది రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: బిగ్ టీవీ ఫోక్ నైట్ 2026.. జానపద గీతాలకు అదిరిపోయే స్టెప్స్ వేసేద్దామా? ఎప్పుడు.. ఎక్కడంటే?

Related News

నాన్న చివరి కోరిక అదే.. ఎలా చనిపోయారో చెబుతూ రఘుబాబు ఎమోషనల్ వీడియో!

ఏడడుగులు వేయబోతున్న వరుణ్ తేజ్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?

తల్లి కోసమే ఇండస్ట్రీకి దూరం.. అసలు విషయం చెప్పిన మాస్టర్ భరత్!

బిగ్ టీవీ ఫోక్ నైట్ 2026.. జానపద గీతాలకు అదిరిపోయే స్టెప్స్ వేసేద్దామా? ఎప్పుడు.. ఎక్కడంటే?

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం.. అసలేం జరిగిందంటే?

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం.. గిరిబాబు అందుకున్న పురస్కారాలు ఇవే!

గిరిబాబు తెలుగులో నటించిన చివరి చిత్రం ఇదే!

Big Stories

Advertisement
×