Tanveer Ahmed On Manal Chauhan Celebration: భారత క్రికెటర్ల మొదళ్లలో విషం నిప్పులుతున్నారు..అందుకే మృగాళ్లలాగా ప్రవర్తిస్తున్నారని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మైదానంలోనే పాకిస్తాన్ ప్లేయర్లపై దాడికి దిగిన అండర్ 19 టీమిండియా ఆటగాళ్లపై వెంటనే బ్యాన్ విధించాలని ఐసీసీని డిమాండ్ చేశాడు. ఆసియా కప్ అండర్ 19 2026 టోర్నమెంట్ లో టీమిండియా జూనియర్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. శనివారం ఉమన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్స్ లో పాకిస్తాన్ జట్టును ఒక్క వికెట్ తేడాతో చిత్తు చేసి తొమ్మిదవ సారి ఛాంపియన్ గా నిలిచింది టీం ఇండియా.
అయితే ఈ మ్యాచ్ ఫైనల్స్ గెలిచిన తర్వాత టీమిండియా కుర్రాళ్ళు అగ్రెసివ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ వికెట్ కీపర్ హంజా జహూర్ ముందు టీమిండియా క్రికెటర్లు లిమిట్ దాటి ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సంఘటనపై ఇండియన్ అభిమానులు పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే… పాకిస్తాన్ మాజీలు మాత్రం ఫైర్ అవుతున్నారు. స్టేడియంలో రౌడీయిజం చేస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారు.
ఆసియా కప్ గెలిచిన తర్వాత అండర్ 19 టీమిండియా క్రికెటర్లు రెచ్చిపోయిన సంఘటనపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యాడు. టీమిండియా క్రికెటర్ల మెదళ్లలో పాకిస్తాన్ బద్ధ శత్రువు అనే భావనను నింపుతున్నారని.. అందుకే నిన్న అండర్ 19 క్రికెటర్లు మృగాల్లా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యాడు. వీళ్ళను ఇలాగే వదిలేస్తే పెను ప్రమాదమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ ట్రోఫీని గెలిచిన ఆనందంలో టీమిండియా క్రికెటర్లు హద్దు మీరారని మండిపడ్డాడు.
మ్యాచ్ అన్నాక గెలుపు, ఓటములు చాలా సహజమని తెలిపాడు. కానీ రౌడీల లాగా మైదానంలో ప్రవర్తిస్తే అస్సలు కుదరదు అన్నాడు. క్రీడా స్ఫూర్తితో ప్రతి క్రికెటర్ వ్యవహరించాలని.. అప్పుడే ప్రతి టోర్నమెంట్ సక్సెస్ అవుతుందని పేర్కొన్నాడు. కానీ టీమిండియా అండర్ 19 కుర్రాళ్ళు మాత్రం చాలా ఓవర్ గా బిహేవ్ చేశారని ఫైర్ అయ్యాడు. వదిలితే, పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి గొడవ చేసే వాళ్ళని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిపై వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశాడు. ఎలాంటి పక్షపాతం లేకుండా అందరినీ విచారించి తప్పు చేసిన వారిపై బ్యాన్ విధించాలని కోరాడు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పెద్దలకు లేఖ కూడా రాస్తానని హెచ్చరించాడు.
Zero hesitation
Straight to the point 🔥
Nikal M.. 😭#indvspaku19 #INDvsPAK pic.twitter.com/77zaxIkkqb
— Akshay Akki (@FollowAkshay1) November 14, 2026