E-Paper
Advertisement

Roja : వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు మావే : మంత్రి రోజా

Roja : వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు మావే : మంత్రి రోజా
Advertisement

Roja : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లను వైసీపీ గెల్చుకుంటుందని ఆ పార్టీ నేత, మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం లంబసింగి పర్యటనకు వెళ్తూ అనకాపల్లి జిల్లాలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను సంక్షేమ పథకాలతో జగన్ సర్కారు ఆదుకుంటోందని చెప్పారు.

జగన్ పాలనతో రాష్ట్రం బాగుపడిందని, అభివృద్ధివైపు పరుగులు పెడుతోందని జనం నమ్ముతున్నారని మంత్రి చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి రోజా చెప్పారు.

Advertisement

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని టూరిజం మినిస్టర్ రోజా చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టాక రాష్ట్రంలో టూరిజం పుంజుకుందని, టెంపుల్ టూరిజంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని చెప్పారు.

టూరిస్టు ప్రాంతాల్లో వసతుల కల్పన కోసం ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని వివరించారు. స్వదేశీ దర్శన్, ప్రసాద పథకాలలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు నాలుగు ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని మంత్రి రోజా చెప్పారు.

Advertisement

తాము అధికారంలోకి రాగానే.. జగన్ సర్కారు తెచ్చిన సంక్షేమ పథకాలను, వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను రద్దు చేస్తామని గతంలో టీడీపీ ప్రకటించిందని మంత్రి రోజా గుర్తుచేశారు. ఇప్పుడు మాటమార్చి, సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారని రోజా విమర్శించారు. టీడీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.

Related News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

వైసీపీకి చిచ్చుపెడుతున్న విజయసాయిరెడ్డి.. మా పార్టీ అసలైన రాయలసీమ రెడ్ల పార్టీ

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

Big Stories

Advertisement
×