Roja vs Bhanu Prakash: ఏపీ రాజకీయం మళ్లీ వేడెక్కింది. ఓవైపు ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీనితో రాష్ట్ర రాజకీయం వైపు అందరి దృష్టి మళ్లిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా చేసిన సంచలన కామెంట్స్ ఏపీ రాజకీయాన్ని ఊపేస్తున్నాయి. వరుస రాజకీయ సంచలనాలకు తెరతీస్తున్న ఏపీ, ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. బిగ్ టీవీ తో ప్రత్యేకంగా మాట్లాడిన రోజా.. తనను విమర్శించే వారికి సవాల్ విసిరారు.
ఇటీవల నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ కు, మాజీ మంత్రి రోజా మధ్య వార్ నడుస్తోంది. భాను ప్రకాష్ మాట్లాడిన తీరుపై రోజా ఒకింత ఆగ్రహం సైతం వ్యక్తం చేశారు. అయితే కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ఉన్న వైరం, ఇప్పుడు భాను ప్రకాష్ వర్సెస్ రోజాల మారిందన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఉన్నట్టుండి ఒక్కసారిగా భాను ప్రకాష్ విమర్శలు చేయడం, ఆ విమర్శలపై రోజా సీరియస్ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయం వేడెక్కింది.
ఇటీవల అదే జిల్లాకు చెందిన ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ కాగా, రోజా కామెంట్స్ వివాదం కూడా అంతే స్థాయిలో వార్తల్లో నిలుస్తోంది. ఒక మహిళ మాజీ మంత్రిని ఇఫ్తారీతిన మాట్లాడడం తగదని, విమర్శలు గుప్పించే సమయంలో వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని, రోజా జోలికి వస్తే ఊరుకోమని కూడా పలువురు సీనియర్ హీరోయిన్లు ఇటీవల రోజాకు మద్దతు పలికారు. ఇలాంటి తరుణంలోనే మాజీ మంత్రి రోజాను బిగ్ టీవీ ప్రత్యేకంగా సంప్రదించింది.
Also Read: India First AI Teacher: రోబో టీచర్ వచ్చేసింది.. ఇక క్లాసులన్నీ ఓ రేంజ్ బాస్!
రోజా మాట్లాడుతూ సంచలన కామెంట్ చేయడం విశేషం. బిగ్ టివితో మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. తాను వెయ్యి కోట్ల రూపాయలు దోచుకున్నానని ఎమ్మెల్యే భాను ప్రకాష్ ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ఆధారాలు చూపించాలన్నారు. ఆ ఆధారాలు తన ఎదుట ఉంచితే చాలు.. తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని రోజా సంచలన కామెంట్ చేశారు. ఆరోపణలు చేసి ఆధారాలు చూపించకుంటే భాను ప్రకాష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు.
కాగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సుమారు 100 కోట్ల వరకు అవినీతి జరిగిందని మాజీ మంత్రి రోజాపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ సైతం సంచలన ఆరోపణలు చేశారు. అయితే ప్రస్తుతం మాజీ మంత్రి రోజా ఆధారాలు చూపించాలని బిగ్ టీవీతో మాట్లాడుతూ కామెంట్ చేయడంతో, మరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ ఆ ఆధారాలు చూపిస్తారా? ఏం చేస్తారన్నది మున్ముందు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రోజా వర్సెస్ భాను ప్రకాష్ వ్యవహారం రోజురోజుకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో తయారైందని చెప్పవచ్చు.