Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న విడుదలకు సిద్దమవుతుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే బీభత్సమైన హడావిడి ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయింది. దాని కారణం పవన్ కళ్యాణ్ సినిమాలు కంటే కూడా రాజకీయాల్లో బిజీగా మారిపోవడమే.
అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గ్యాప్ తీసుకుని వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎటువంటి సీన్స్ ఉంటే హై ఉంటుందో అవన్నీ బాగా డిజైన్ చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చేశారు ఆ సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు.
చాలా సంవత్సరాల తర్వాత
మామూలుగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేసిన తర్వాత దాని ప్రమోషన్స్ లో పెద్దగా కనిపించరు. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే దానికి హాజరవుతారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్స్ లో పాల్గొన్న దాఖలాలు చాలా తక్కువ. అయితే చాలా ఏళ్లు తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. హరిహర వీరమల్లు సినిమా రేపు 10 గంటలకు ప్రెస్ మీట్ జరగనుంది. ప్రెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారు. ఎప్పుడు హాజరు కాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు హాజరవుతున్నారు అంటే అది నిర్మాత మీద ఉన్న ప్రేమ అని చెప్పొచ్చు. నిర్మాత ఏం రత్నం కూడా మంచి కమిట్మెంట్తో సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఆయన చేసిన సినిమాలకి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంది.
పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం
తమిళంలో ఖుషి సినిమా హిట్ అయిన తర్వాత, అదే సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని ఫైట్స్ కూడా పవన్ కళ్యాణ్ డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ రేణు దేశాయ్. ఖుషి సినిమా తర్వాత ఏం రత్నం నిర్మాతగా బంగారం అనే సినిమాను నిర్మించారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి హరిహర వీరమల్లు సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. గతంలో సత్యాగ్రహి అనే సినిమాను నిర్మించే ప్రయత్నం చేశారు. పూజ కూడా జరిగింది కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రెస్ మీట్ కి రావడం అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో టాపిక్ గా మారింది.
Also Read: Mohan Lal: ఫహద్ ఫాజిల్ అంటే మోహన్ లాల్ కి ఇష్టం లేదా ? అతని పేరు చెప్పగానే అలా వెళ్ళిపోయాడు ఏంటి?