BigTV English

OTT Movie : బస్సుపై శవం… నరాలు తెగే ఉత్కంఠ… మైండ్ బెండయ్యే మలయాళ థ్రిల్లర్

OTT Movie : బస్సుపై శవం… నరాలు తెగే ఉత్కంఠ… మైండ్ బెండయ్యే మలయాళ థ్రిల్లర్

OTT Movie : ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమా ? అయితే ఈ మూవీ మీ కోసమే. ఇందులో ఏకంగా కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్ కే చెవులు విన్పించవు. ఇంతకీ ఈ చెవిటి పోలీస్ ఆఫీసర్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు ? అనే విషయాన్ని స్టోరీలో తెలుసుకుందాం. ఇక ఈ మూవీలో ట్విస్టులకేమీ కొదవ ఉండదు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ మలయాళ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ పేరు ‘జాన్ లూథర్’. అభిజిత్ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయసూర్య హీరోగా నటించారు. పట్టుదల గల పోలీస్ ఆఫీసర్ ఒక మిస్టరీ మిస్సింగ్ పర్సన్ కేసును విచారిస్తూ, ఒక ప్రమాదంలో తన వినికిడి శక్తిని కోల్పోయినప్పటికీ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి పోరాడే కథ ఇది. అలోన్సా ఫిల్మ్స్ బ్యానర్‌లో థామస్ పి. మాథ్యూ ఈ మూవీని నిర్మించారు. ఇందులో జయసూర్య (జాన్ లూథర్), ఆత్మీయ రాజన్ (జెస్సీ), దృశ్య రఘునాథ్ (లీనా), సిద్దీఖ్ (రాజన్), దీపక్ పరంబోల్ (ఫెలిక్స్), సెంతిల్ కృష్ణ, కుమరవేల్, శివదాసన్ కన్నూర్, మరియు ప్రమోద్ వెల్లియనాడ్ తదితరులు నటించారు. IMDbలో రేటింగ్ 6.8 మాత్రమే ఉన్నప్పటికీ 2010లో రిలీజ్ అయిన మలయాళ సినిమాలలో ఉత్తమ థ్రిల్లర్‌లలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం మనోరమా మ్యాక్స్ (Manorama Max), సింప్లీ సౌత్‌ (Simply South) ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో కూడా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…
ఈ మూవీ స్టోరీ మున్నార్‌లోని దేవికులం పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే జాన్ లూథర్ (జయసూర్య) చుట్టూ తిరుగుతుంది. అతను తన జాబ్ పట్ల అంకితభావంతో ఉండే పోలీస్ ఆఫీసర్. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేంతగా పనిలో మునిగిపోతాడు. కథ మున్నార్‌లోని ఒక బస్సుపై భాగంలో, ఒక డెడ్ బాడీ కనిపించడంతో ప్రారంభమవుతుంది. ఇది ఒక మోటర్‌బైక్ యాక్సిడెంట్‌కు సంబంధించిన కేసు. ఇందులో డ్రైవర్ ప్రకాశన్ (సెంతిల్ కృష్ణ) మరణిస్తాడు. కానీ రైడర్ మిస్ అవుతాడు.


Read Also : కొడుకు ముందే తల్లితో ఆ పాడు పని… వాడిచ్చే షాక్ కు ఫ్యూజులు అవుట్… యాక్షన్ ప్రియులు మస్ట్ వాచ్

జాన్ ఈ కేసు విచారణను తీసుకుంటాడు. అదే సమయంలో అతను తన సోదరి లీనా (దృశ్య రఘునాథ్) ఎంగేజ్‌మెంట్ సెర్మనీకి ఆలస్యంగా చేరుకుంటాడు. దీంతో అతని రాజన్ (సిద్దీఖ్) లేట్ గా వచ్చినందుకు అక్షింతలు వేస్తాడు. ఇక విచారణ సమయంలో, జాన్ మరో కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ, ప్రమాదంలో తన వినికిడి శక్తిని కోల్పోతాడు. దీంతో కేసు విచారణ మరింత కష్టతరం అవుతుంది. ఈ అడ్డంకి ఉన్నప్పటికీ, జాన్ తన అసిస్టెంట్ ఫెలిక్స్ (దీపక్ పరంబోల్) సహాయంతో మిస్సింగ్ పర్సన్ కేసును కొనసాగిస్తాడు. ఈ నేపథ్యంలోనే మరిన్ని మిస్సింగ్ కేసులు వెలుగులోకి వస్తాయి. అసలు వాళ్లంతా ఎలా మిస్ అయ్యారు? ఆ సీరియల్ కిల్లర్ ను పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నారు? చెవులు విన్పించకపోయినా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : 30 ఏళ్ల మహిళను పట్టుకుని పాడు పని… పిల్లలు పుట్టట్లేదని వెళ్తే ఇదెక్కడి దిక్కుమాలిన ట్రీట్మెంట్ సామీ ?

OTT Movie : పుట్టినరోజునే బలి… బర్త్ డేను డెత్ డే చేసే మాస్క్ కిల్లర్… టైం లూప్ లో చచ్చి బతుకుతూ… లాస్ట్ ట్విస్ట్ అదుర్స్

OTT Movie : కోరి శాపాన్ని కొని తెచ్చుకునే ఫ్యామిలీ… నెక్లెస్ కు దెయ్యాలతో లింక్… సీట్ చిరిగిపోయే హర్రర్ మూవీ

OTT Movie’s: ఘాటీ, మదరాసి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : పిచ్చి అమ్మాయిలను కిరాతకంగా అనుభవించే సైకో డాక్టర్… బ్లాక్ మార్కెట్ లో బాడీ పార్ట్స్… భయంకరమైన రియల్ స్టోరీ సామీ

OTT Movie : ముసలోడే కానీ మహానుభావుడు… ఆడవాళ్లు కన్పిస్తే అదే పని… అవార్డు విన్నింగ్ మలయాళ మూవీ

Big Stories

×