BigTV English

MLA Roja vs KC Shanti: చేతిలోన చెయ్యేసి కలిపేయనా!.. జగనన్నకు హ్యాండిచ్చిన రోజమ్మ!

MLA Roja vs KC Shanti: చేతిలోన చెయ్యేసి కలిపేయనా!.. జగనన్నకు హ్యాండిచ్చిన రోజమ్మ!
YSRCP latest news today

YSRCP latest news today(AP political news) :

మంత్రి రోజా ఇలాఖా నగరిలో వైసీపీ గ్రూపు తగాదాలు కలకలం రేపాయి. రోజాకు, కేసీ శాంతికి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు సీఎం జగన్. వారిద్దరి చేతులు కలిపారు. అయితే, జగనన్న చేతిలోంచి వెంటనే చెయ్యి లాగేసుకున్నారు మంత్రి రోజా. ఈ దృశ్యం వైసీపీలో హాట్ టాపిక్ అయింది. జగన్ చెప్పినా రోజా తగ్గేదేలే అంటున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. అదే సమయంలో కేసీ శాంతికి జగన్ అభయహస్తం అందించడం మరింత ఆసక్తికరంగా మారింది.


మంత్రి రోజాను నగరిలో అసమ్మతి రాజకీయాలు వెంటాడుతున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ అసమ్మతి వర్గాలు ఆమెకు తలనొప్పిగా మారాయి. కేజీ శాంతితోనే కాదు.. పుత్తూరులో అమ్ములు నాయకత్వం, నిండ్ర మండలంలో చక్రపాణి రెడ్డి నాయకత్వంలో అసమ్మతి ఉన్నట్టు తెలుస్తోంది. విజయపురంలో రాజు, వేడమాలపేటలో మురళి రెడ్డి నాయత్వాల్లోనూ రోజాకు వ్యతిరేకంగా ఉన్నారు.

పార్టీ శ్రేణులను కాదని.. కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వడంతోనే రోజాకు వ్యతిరేకత పెరిగిందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ గ్రూపు పాలిటిక్స్‌పై ఫోకస్‌ పెట్టారు. ఈ మేరకు నగరి సభాస్థలం వద్ద రోజా, కేజీ శాంతిల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేశారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×