BigTV English

BJP: బీజేపీలో కాంగ్రెస్ కాక!.. అభ్యర్థుల కోసం వేట!!

BJP: బీజేపీలో కాంగ్రెస్ కాక!.. అభ్యర్థుల కోసం వేట!!
bjp leaders

BJP: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండుసార్లు అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్‌ను గద్దె దించి.. తాము పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది కమలం పార్టీ. ఈ మేరకు పార్టీ హైకమాండ్‌ ప్రత్యేకంగా తెలంగాణపై ఫోకస్‌ పెట్టింది. ఇటీవలే బీజేపీ టీమ్‌లో మార్పులు చేర్పులు కూడా చేసింది. ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై దృష్టి సారించింది. గ్రౌండ్‌ లెవల్లో వర్క్‌ మొదలుపెట్టిన కమలనాథులు అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యారు. నెలాఖరులోగా తొలి జాబితా ప్రకటించేందుకు డెడ్‌లైన్‌ పెట్టుకున్నట్టు సమాచారం. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన నేతలను అసెంబ్లీ సెగ్మెంట్‌లో దించింది. వారు వారం రోజులపాటు అక్కడే ఉండి నియోజకవర్గ స్థితిగతులను అంచనా వేసి అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారట. ఇక ఇప్పటికే దాదాపు అన్ని డివిజన్‌లలో సర్వే నివేదికలు అందడంతో దాని ప్రకారం అభ్యర్థుల లిస్టు ప్రకటించే ఛాన్స్‌ కనిపిస్తోంది.


అభ్యర్థుల లిస్టు ప్రకటనలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలుపు గుర్రాలపై ఫోకస్‌ పెట్టిన హైకమాండ్‌.. తొలివిడతలో 30 నుంచి 35 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ప్రజల్లో ఇమేజ్‌ ఉన్న నేతలు మొదటి జాబితాలో ఉండనున్నారు. ఒకరికి మించి ఎక్కువగా ఆశావహులు లేని నియోజకవర్గాలనే ఫస్ట్‌ లిస్టుగా ఎంచుకుంది. ఎక్కువ కాంపిటిషన్‌ ఉన్న స్థానాల ఎంపిక తర్వాత లిస్టులో ఉండనుంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత పలువురు పార్టీ వీడి పక్క చూపులు చూసే ఆస్కారం ఉండటంతో హైకమాండ్‌ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇటీవలే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనతో అసంతృప్తులు గులాబీకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో బీజేపీ ఈ తరహ వ్యూహాన్ని ఎంచుకుందని చెబుతున్నారు.

బీఆర్ఎస్ టికెట్ రాని నేతలు.. వెంటనే బీజేపీలో చేరిపోతారని ఆశపడింది. కానీ, అలా జరగలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా కాషాయ కండువా కప్పుకోలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు గులాబీ లీడర్. కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకంతోనే అలు వైపు చేరికలు పెరిగాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. కమలం పార్టీకి అంత సీన్ లేదని భావిస్తున్నారు కాబట్టే.. బీజేపీలో చేరేవారు కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. ఈ ప్రచారం ఆ పార్టీకి బిగ్ మైనస్ అవుతోంది. అందుకే, ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఎన్ని వలలు విసురుతున్నా.. ఒక్కటంటే ఒక్క చిన్న చేప కూడా చిక్కట్లేదని చెబుతున్నారు.


అభ్యర్థుల కోసం గాలిస్తూనే.. బలహీనంగా ఉన్న స్థానాలపై దృష్టి సారించారు కాషాయ నేతలు. కాంగ్రెస్‌ క్యాండిడేట్స్‌ లిస్ట్ మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ముందుగా హస్తం పార్టీ అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తే.. టికెట్ రాని గోపీలు.. తమ వైపు గోడ దూకుతారని ఆశగా ఉంది. అందుకే, పక్కా కన్ఫామ్డ్ కేండిడేట్స్ మినహా.. మెజార్టీ సీట్లను కాంగ్రెస్ లిస్ట్ తర్వాతే బీజేపీ ప్రకటించనుందని తెలుస్తోంది. మరి, అభ్యర్థుల ఎంపికే ఇంత కష్టమైతే.. ఇక గెలుపు ఇంకెంత కష్టం? అంటున్నారు.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×