BigTV English

Rowdy Sheeter Srikanth: ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్న రౌడీషీటర్ శ్రీకాంత్ హిస్టరీ..

Rowdy Sheeter Srikanth: ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్న రౌడీషీటర్ శ్రీకాంత్ హిస్టరీ..

Rowdy Sheeter Srikanth: అతడో కరడుగట్టిన నేరగాడు. హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక సమయంలో జైలు నుంచి పారి పోయాడు. నాలుగున్నరేళ్లుగా బయటే ఉండి నేర సామ్రాజ్యం విస్తరించాడు. హత్యలు, దాడులు, కిడ్నాపులు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, గంజాయి స్మగ్లింగ్.. ఇలా అతడు చేయని నేరం లేదు. 4 జిల్లాల పరిధిలో సుమారు 200 మందితో ఒక గ్యాంగు ఏర్పాటు చేసుకున్నాడు.


జైల్లో ఖైదీగా ఉంటూ.. జైలర్ ఎవరుండాలో కూడా డిసైడ్..
ఏ కాంట్రాక్టు పనికి ఎవరు టెండర్లు వేయాలో కూడా అతడే డిసైడ్ చేసేవాడు. జైల్లో ఖైదీగా ఉంటూనే దందాలు నడిపిస్తున్నాడు. తానుంటున్న జైలుకు సూపరింటెండ్ గా తాను కోరిన అధికారినే నియమించుకోదగిన స్థాయికి చేరాడంటే పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు. ఇతడి రేంజ్ ఏంటో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అతడే తిరుపతి జిల్లా గూడురుకు చెందిన శ్రీకాంత్. అతడి ప్రియురాలు నెల్లూరు అరుణ.

శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వొద్దంటూ తిరుపతి ఎస్పీ రిపోర్ట్..
ఇంతటి కరడుగట్టిన నేరగాడికి పెరోల్ ఇవ్వొద్దని స్వయంగా తిరుపతి జిల్లా ఎస్సీ, నెల్లూరు జైలు సూపరింటెండెంట్ కి నివేదికనివ్వగా.. ఇవ్వాల్సిందేనంటూ అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిథులు సిఫార్సు చేయడం గమనార్హం. ఒక మంత్రి ఈ సిఫార్సులను ఎండార్స్ చేస్తూ ఎగ్జామిన్ అండ్ సర్క్యూలెట్ అంటూ కార్యదర్శికి ఆదేశించారు. ప్రభుత్వంలో ఒక ఉన్నత స్థాయి అధికారి అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆగమేఘాలపై శ్రీకాంత్ కి పెరోల్ జారీ అయ్యింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఆ జీవోను, వెబ్ లో పెట్టలేదంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. ప్రజా ప్రతినిథులు, మంత్రులే సిఫార్సు చేయడంతో ఏం చేయాలో అర్ధం కాక.. తల పట్టుకుంటోంది ప్రభుత్వం.


నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు
నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు చేశారు అధికారులు. ఈ ఘటనపై సీరియస్ అయ్యారు హోం మంత్రి అనిత. మంత్రికి తెలీకుండానే శ్రీకాంత్‌కి పెరోల్ మంజూరు చేసినట్టు గుర్తించారు. ఒక ఉన్నతాధికారి సూచన మేరకు హోం సెక్రటరీ ఈ పెరోల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఈ పెరోల్ వ్యవహారం వెనక ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పేరోల్ మంజూరయ్యాక రౌడీ షీటర్ శ్రీకాంత్ ఓ ఎమ్మెల్యేను కలిసినట్టు గుర్తించారు.

ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్
ప్రభుత్వంలో అత్యంత కీలక అధికారి సూచనతో రౌడీ షీటర్ కు పెరోల్ ఇచ్చినట్టు మంత్రికి చెప్పారు హోం సెక్రటరీ. ఈ క్రమంలో శ్రీకాంత్ పెరోల్ రద్దు చేసి విచారణకు ఆదేశించారు హోం మంత్రి అనిత. తనకు అత్యంత త్వరలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్ గా ఉంది.

నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్, ఓ మహిళ రాసలీలల వ్యవహారం నెల్లూరు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. రౌడీ షీటర్ శ్రీకాంత్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జిల్లా సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్.. ఆస్పత్రిలో ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ఇతడు మహిళతో సన్నిహితంగా ఉన్నట్టు కనిపిస్తోందా వీడియోలో.

అయితే.. పోలీసుల అదుపులో ఉన్న సమయంలోనూ మహిళతో సన్నిహతంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పోలీసులే సహకరించారనే ఆరోపణలు సైతం వినవస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలపై పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో.. పోలీసుల సహకారంతోనే ఆ ఘటన జరిగి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. ఒక రౌడీ షీటర్ ఇంత ధైర్యంగా నిబంధనలు అతిక్రమిస్తుంటే జైలు అధికారులు, పోలీసు అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. ఇటీవల రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ మీద బయటకు వచ్చాడు. రౌడీషీటర్ పెరోల్ విషయంలో ఈ మహిళ చక్రం తప్పిందన్న ప్రచారమూ జరుగుతోంది. ఇదే విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియడంతో.. రౌడీషీటర్ శ్రీకాంత్‌ పెరోల్‌ను వెంటనే రద్దు చేశారు పోలీసులు. పెరోల్ రద్దు కావడంతో శ్రీకాంత్‌ను మళ్లీ జైలుకు తరలించారు. ఓ మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు రౌడీషీటర్ శ్రీకాంత్. శ్రీకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన ప్రతిసారీ ఈ మహిళతో రాసలీలలు నడిపినట్టు ప్రధాన ఆరోపణ. ఇప్పటి వరకూ వీరిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Also Read: భీఆర్ఎస్‌కు దిక్కెవరు.. పత్తాలేని నాయకులు!

మరోవైపు.. ఆ మహిళకు పలువురు పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులతో సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ మహిళ పోలీసులను శాసించినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కూటమి ప్రభుత్వంలోనూ పోలీసు శాఖతో ఉన్న సంబంధాలతో మళ్ళీ చక్రం తిప్పుతున్నట్టు సమాచారం.

Related News

Amaravati News: అమరావతిపై వైసీపీ అవే మాటలు.. కౌంటర్‌లో పాలక‌పక్షం, కేసులు నమోదు?

Kuna RaviKumar: ప్రిన్సిపల్ ఆడియో బయటకు.. అసలు విషయాలు వెల్లడించిన ఎమ్మెల్యే కూన రవికుమార్

AP Politics: బాబుకు ఝలక్! ఆళ్ల నాని వైసీపీలోకి వెళ్తున్నాడా?

Cyclone Alert: ఉత్తరాంధ్రను వణికించే న్యూస్.. రేపు మరింత డేంజర్?

Amaravati: వెల్కమ్ టు అమరావతి.. జగన్ కు టీడీపీ వెరైటీ ఛాలెంజ్

Big Stories

×