Nandamuri:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలలో నందమూరి కుటుంబం కూడా ఒకటి. ఇప్పటికే ఈ కుటుంబం నుండి ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే నందమూరి కుటుంబం అనగానే వెంటనే మనకు దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR), జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR), బాలకృష్ణ (Balakrishna ), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) పేర్లు ప్రధమంగా వినిపిస్తాయి. ముఖ్యంగా నాలుగు తరాల హీరోలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ కుటుంబం నుండి చలామణి అవుతుండడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నందమూరి కుటుంబంలో విషాదం..
స్వర్గీయ నందమూరి తారక రామారావు కొడుకు నందమూరి జయకృష్ణ (Nandamuri Jayakrishna) భార్య పద్మజ (Padmaja ) కన్నుమూశారు. ఈమె దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి స్వయానా సోదరి అవుతుంది. ఈమె మరణంతో రెండు కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పద్మజ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఫిలింనగర్ లోని అపోలో బ్యాక్ సైడ్ లో ఉన్న తన ఇంట్లో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దగ్గుబాటి పద్మజ మరణ వార్త విని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో హైదరాబాదుకు చేరుకొని ఆమె పార్టీవదేహాన్ని సందర్శించనున్నారు. పద్మజ ఎవరో కాదు ప్రముఖ యంగ్ హీరో నందమూరి చైతన్య కృష్ణ తల్లి.
పద్మజా మృతికి కారణం ఇదే..
గత కొంతకాలంగా పద్మజ అనారోగ్యంతో బాధపడుతున్నారట. ఈరోజు తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో.. హుటాహుటిన హాస్పిటల్ లో చేర్పించారు. అయితే ఆమె మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి .. దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ నుంచి బయలుదేరారని నందమూరి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఈమె వయసు 73 సంవత్సరాలు.
నందమూరి చైతన్య కృష్ణ..
నందమూరి చైతన్య కృష్ణ కెరియర్ విషయానికి వస్తే.. బ్రీత్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.. అయితే ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కంటే ముందు జగపతిబాబు హీరోగా వచ్చిన ‘ధమ్’ సినిమాలో గుర్తింపు లేని ఒక పాత్ర చేశారు. ఆ తర్వాత యాక్టింగ్ పక్కన పెట్టిన ఈయన.. మళ్లీ బ్రీత్ సినిమాతో అడుగు పెట్టారు. మొదటి సినిమాతోనే ఘోరమైన డిజాస్టర్ ను అందుకోవడంతో భారీ ట్రోల్స్ వచ్చాయి. కానీ ఈయన మరో సినిమా ప్రకటించడం గమనార్హం.. జీకే చౌదరి అనే కో డైరెక్టర్ చైతన్య కృష్ణతో సినిమా చేయబోతున్నట్లు గతంలో ఒక ఫోటో కూడా షేర్ చేశారు. ఇక వరుసగా డిజాస్టర్లు చవిచూస్తున్న నేపథ్యంలో తెలిసి కూడా గోతిలో పడడం అంటే ఇదే అని ఆయనపై చాలామంది విమర్శలు గుప్పించడం గమనార్హం.
పద్మజ మరణంపై సీఎం చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్..
పద్మజ మరణంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు..” బావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ఘటన మా కుటుంబంలో విషాదం నింపింది. పద్మజా ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
బావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ఘటన మా కుటుంబంలో విషాదం నింపింది. పద్మజ ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) August 19, 2025
ALSO READ:90’s A Middle Class: అవార్డుల పంట పండించిన శివాజీ 90’స్.. సంతోషంలో టీమ్!