Borugadda Anil: ఏపీలో కొందరు పోలీసుల తీరు మారలేదా? పాత ప్రభుత్వం ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారా? నిందితుల విషయంలో కఠినంగా ఉండాలని చెప్పినా పట్టించుకోలేదా? కొందమంది పోలీసులను ఉన్నతాధికారులను వేటు వేసినా, దాని గురించి బయటపడలేదా? పార్టీ నేతలకు పల్లకి మోసే పనిలో నిమగ్నమయ్యారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీ నేతగా చెప్పుకునే వారిలో బోరుగడ్డ అనిల్ ఒకరు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన నేతలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాండాంత లిస్టు ఉంది.
ప్రభుత్వం మారిన తర్వాత వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బోరుగడ్డ అనిల్‌ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్ రెండురోజుల కిందట విచారణ కోసం గుంటూరు వచ్చాడు. ఆయనకు ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో రాచ మర్యాదలు చేశారు కొందరు వైసీపీ సానుభూతి పరులైన పోలీసులు.
బోరుగడ్డ అనిల్ పడుకునేందుకు స్టేషన్‌లో ఓ టేబుల్ ఇచ్చారు. ఆపై దిండు, దుప్పటి ఇచ్చి రాచ మర్యాదలు చేశారు. దీనికి సంబంధించి దృశ్యాలు స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వైసీపీ నిందితులకు రాచ మర్యాదలు ఈ రేంజ్‌లో ఉంటాయా అంటూ ఆశ్చర్యపడడం సామాన్యుల వంతైంది.
ALSO READ: ఏపీకి నంబర్ వన్ బ్రాండ్ తీసుకొస్తాం: చంద్రబాబు
బోరుగడ్డ అనిల్‌కు బిర్యానీ విషయంలో ఏకంగా ఏడుగురు పోలీసులు బుక్కయ్యారు. చివరకు వారిని పైస్థాయి అధికారులు సస్పెండ్ అయ్యారు. అయినా పోలీసుల్లో మాత్రం పాత వాసన పోయినట్టు కనిపించలేదు. ఇవన్నీ కంటికి కనిపించినవి మాత్రమే. కనిపించనవి తెర వెనుక ఇంకెన్ని ఉన్నాయో?
బోరుగడ్డు అనిల్ విషయంలో ఇలా ఉంటే.. వైసీపీకి చెందిన మిగతా నిందితుల విషయంలో ఇంకెలా ఉంటున్నారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో ఇప్పుడిది కాదని, బోరుగడ్డ మొదట్లో వచ్చినదని కొందరు దిగువస్థాయి పోలీసులు చెబుతున్న మాట. బయటకు వచ్చిన ఈ వీడియోపై డిపార్ట్‌మెంటులో అంతర్గత విచారణ మొదలైంది.
ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే బోరుగడ్డ అనిల్ కు పోలీసుల రాచ మర్యాదలు.
గుంటూరులో విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన
బోరుగడ్డ అనిల్.బోరుగడ్డ అనిల్ పడుకునేందుకు దిండు, దుప్పటి ఇచ్చి రాచ మర్యాదలు చేస్తున్న పోలీసులు. #borugaddaanilkumar #Guntur #Bigtv pic.twitter.com/79FyZXeGP0
— BIG TV Breaking News (@bigtvtelugu) November 9, 2024