BigTV English

Chandrababu: ఏపీకి నంబ‌ర్ వ‌న్ బ్రాండ్ తీసుకొస్తాం: చంద్ర‌బాబు

Chandrababu: ఏపీకి నంబ‌ర్ వ‌న్ బ్రాండ్ తీసుకొస్తాం: చంద్ర‌బాబు

Chandrababu: వెంటిలేట‌ర్ పై ఉన్న రాష్ట్రానికి ప్ర‌జ‌లు ఆక్సీజ‌న్ ఇచ్చార‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రంలో సీ ప్లేన్ టూరిజం సేవ‌ల‌ను చంద్ర‌బాబు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సివిల్ ఏవియేష‌న్ ను రామ్మోహ‌న్ నాయుడు అద్భుతంగా నడిపిస్తున్నార‌ని కొనియాడారు. భ‌విష్య‌త్ అంతా టూరిజందే అని అన్నారు. విధ్వంసమైన వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెడుతున్నామ‌ని వ్యాఖ్యానించారు. ఇంత‌కాలం ఏపీని చూసి అవ‌హేళ‌న చేశారని అన్నారు. త‌మ ప్ర‌భుత్వంలో ఏపీకి మ‌ళ్లీ నంబ‌ర్ వ‌న్ బ్రాండ్ తీసుకువ‌స్తామ‌ని చెప్పారు. ఏపీలో ప్ర‌జ‌లు గెలిచార‌ని, రాష్ట్రాన్ని నిలబెట్టార‌ని అన్నారు. ప్ర‌భుత్వ విధానాలు చాలా ముఖ్య‌మ‌ని, ప్ర‌భుత్వం నిర్ణ‌యాల వ‌ల్ల భావి త‌రాలకు భవిష్య‌త్ ఉంటుంద‌న్నారు.


తాను 20 ఏళ్ల క్రితమే ఐటీ గురించి ప్ర‌స్తావిస్తే ఐటీ తిండి పెడుతుందా అని ఎద్దేవా చేశార‌ని అన్నారు. కానీ ఆ రోజు వేసిన ఫౌండేష‌న్ వ‌ల్ల‌నే తెలుగు వాళ్లు అమెరికాలో ఐటీలో ప‌నిచేస్తున్నార‌ని చెప్పారు. అమెరికాలో ప‌ర్ కాపిటాలో కూడా భార‌తీయులే ముందున్నార‌ని అన్నారు. ఏపీ నుండి వెళ్లిన‌వాళ్లు ల‌క్షా ఇర‌వై వేలు సంపాదిస్తున్నార‌ని అన్నారు. అమెరికాలో ఉన్నా విజ‌య‌వాడ‌లో ఉన్నా ఆదాయం పెంచేందుకు ప్ర‌య‌త్నించాన్నారు. ఏపీలో పుట్టిన వాళ్లు ఇక్క‌డ రాణించ‌రు కానీ ప‌క్క రాష్ట్రాల్లో, ఇత‌ర ప్రాంతాల్లో రాణిస్తార‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోనే వ‌న‌రులు ఉన్నాయ‌ని, సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు.

విజ‌య‌వాడ‌ను హైద‌రాబాద్ కు దీటుగా అభివృద్ధి చేస్తామ‌న్నారు. మోడీ కూడా సీప్లేన్ లు ప్ర‌మోట్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చార‌న్నారు. సీప్లేన్ ల‌కు ఎయిర్ పోర్టు కూడా అవ‌స‌రం లేద‌ని అన్నారు. రాబోయే రోజుల్లో సీప్లేన్ తో ఎక్క‌డికైనా ప్ర‌యాణం చేసే అవ‌కాశం వ‌స్తుంద‌న్నారు. సీప్లేన్ ద్వారా ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌న్నారు. ఏమైనా స‌మ‌స్య వ‌స్తే యువ‌త భ‌య‌ప‌డిపోవ‌ద్దని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. రాబోయే రోజుల్లో డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేసేలా ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నామ‌న్నారు. యువత హార్డ్ వ‌ర్క్ కాకుండా స్మార్ట్ వ‌ర్క్ చేయాల‌ని సూచించారు.


Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×