BigTV English
Advertisement

Kannappa: ప్రభాస్ లుక్ లీక్ పై ఆగ్రహం… లీక్ చేసిన వాళ్లను పట్టుకున్న వారికి “కన్నప్ప” టీం బంపర్ ఆఫర్

Kannappa: ప్రభాస్ లుక్ లీక్ పై ఆగ్రహం… లీక్ చేసిన వాళ్లను పట్టుకున్న వారికి “కన్నప్ప” టీం బంపర్ ఆఫర్

Kannappa : మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘కన్నప్ప’ (Kannappa) నుంచి తాజాగా ప్రభాస్ (Prabhas) లుక్ లీకై షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై హీరో మంచు విష్ణు (Manchu Vishnu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఈ సినిమా కోసం తనతో పాటు చిత్రబృందం మొత్తం పడిన కష్టాన్ని వివరించారు. ఈ మేరకు ఓ లెటర్ ని రిలీజ్ చేసిన ఆయన ప్రభాస్ లుక్ ను లీక్ చేసిన వారిని పట్టిస్తే, భారీగా రివార్డు ఉంటుందంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు.


మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పొందుతున్న మూవీ ‘కన్నప్ప’ (Kannappa). మోహన్ బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్,  అక్షయ్ కుమార్ తో పాటు పలువురు స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ప్రభాస్ కీలకపాత్రను పోషిస్తున్నాడు అన్న విషయం తెలిసినప్పటి నుంచి అందరూ ఆయన లుక్ కోసమే వెయిట్ చేస్తున్నారు. కానీ తాజాగా లీక్ రాయుళ్ళు ప్రభాస్ లుక్ లీక్ చేసి ఆ సస్పెన్స్ కు తెర దించారు. ఊహించని ఈ పరిణామంతో షాక్ తిన్న ‘కన్నప్ప’ టీం తాజాగా స్పందించింది.

‘కన్నప్ప’ (Kannappa) చిత్ర నిర్మాత, హీరో మంచి విష్ణు ఈ మేరకు స్పెషల్ గా ఓ లెటర్ ని రిలీజ్ చేశారు. ఆ లెటర్ లో “కన్నప్ప టీం నుంచి ఎమర్జెన్సీ, హృదయపూర్వక విజ్ఞప్తి… ప్రియమైన ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అందరూ హీరోల అభిమానులను కోరుతున్నాము… ఈ మూవీ కోసం గత 8 ఏళ్లుగా మేము మా ప్రాణాలను, హృదయాలను పెట్టి పని చేస్తున్నాం. రెండు సంవత్సరాల నిబద్ధతతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మా టీం రాత్రి పగలు తేడా లేకుండా కృషి చేస్తోంది. ఇలాంటి సమయంలో కన్నప్ప సినిమా నుంచి ఒక వర్కింగ్ ప్రోగ్రెస్ ఇమేజ్ అనధికారికంగా లీక్ కావడం బాధాకరం. ఈ విషయం పట్ల మేము చింతిస్తున్నాము.


ఈ లీక్ అనేది మా కష్టాన్ని మాత్రమే కాకుండా ఈ ప్రాజెక్టు కోసం నిరంతరం పనిచేస్తున్న 2000 మందికి పైగా విఎఫ్ఎక్స్ కళాకారుల జీవితాలను కూడా ఎఫెక్ట్ చేస్తోంది. అసలు ఈ లీక్ ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మేము పోలీస్ కేసు పెడుతున్నాము. అలాగే ఈ లీకైన ఇమేజ్ ను ఎవరైనా షేర్ చేస్తే ఆ దొంగల్ని పట్టుకోమని అభిమానులు అందర్నీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అలాగే ఒకవేళ ఎవరైనా దీన్ని షేర్ చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ లీక్ చేసినవారిని ఎవరైనా కనుక్కోగలిగితే వారికి ఐదు 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాము. విషయం తెలిస్తే వెంటనే 24 ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ ట్విట్టర్ అకౌంట్ కు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి ” అంటూ సుదీర్ఘ నోట్ రిలీజ్ చేశారు. దీంతో ఇప్పుడు లీక్ రాయుళ్ళకు షాక్ తగిలింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×