BigTV English
Advertisement

Sajjala Comments: చంద్రబాబుకి సజ్జల హెచ్చరిక.. ఇదీ మరీ కామెడీ బాసూ

Sajjala Comments: చంద్రబాబుకి సజ్జల హెచ్చరిక.. ఇదీ మరీ కామెడీ బాసూ

చంద్రబాబు లిక్కర్ స్కామ్ లో ఇంకా బెయిల్ పైనే ఉన్నారని, ఆ విషయం గుర్తు పెట్టుకుని ప్రవర్తించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు లిక్కర్ స్కామ్ టీడీపీ హయాంలో జరిగిందని, ఇప్పుడు కట్టుకథలు అల్లి తమ పార్టీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారాయన. పోనీ టీడీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందే అనుకుంటే మరి సాక్ష్యాధారాలు సేకరించి చంద్రబాబుని అరెస్ట్ చేయించి ఉంటే సరిపోయేది కదా. ఇప్పుడు సాక్ష్యాలు చూపించి మరీ నిందితుల్ని అరెస్ట్ చేస్తుంటే సజ్జల ఆవేశ పడటం దేనికంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసులో పక్కాగా ఆధారాలు సేకరించిందని, అందుకే నిందితులకు కోర్టులు బెయిల్ కూడా మంజూరు చేయడం లేదని చెబుతున్నారు. ఆధారాలతో సహా అడ్డంగా బుక్కయ్యారని, ఇప్పటికే కొంతమందిని విదేశాలకు పంపించేశారని, మిగిలినవారే ఇప్పుడు పోలీసులకు చిక్కారని అంటున్నారు.


2023లో కేసేంటి?
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒకవేల 2014 నుంచి 2019 వరకు నిజంగానే మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగి ఉంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలోని పెద్దలపై కేసు పెట్టి ఉండాలి. కానీ వైసీపీ నేతలు చంద్రబాబుపై 2023లో కేసు పెట్టారని, ఆ కేసులో ఆయన ముందస్తు బెయిల్ తెప్పించుకున్నారని చెబుతున్నారు. ఇటీవల జగన్ కూడా లిక్కర్ స్కామ్ చంద్రబాబు హయాంలో జరిగిందని అన్నారు. ఇప్పుడు సజ్జల కూడా ఆ వ్యాఖ్యల్ని రిపీట్ చేశారు. చంద్రబాబు లిక్కర్ కేసులో బెయిల్ పై తిరుగుతున్నారని చెప్పారు. అయితే ఆ కేసు పూర్వాపరాలు, అప్పుడు అసలు స్కామ్ ఎలా జరిగిందనే విషయాన్ని మాత్రం వైసీపీ నేతలెవరూ వివరించలేకపోవడం విశేషం. ఒకవేళ నిజంగానే స్కామ్ జరిగితే.. నిందితుల్ని కనీసం అరెస్ట్ చేయించే విధంగా అయినా సాక్ష్యాధారాలు ఎందుకు సేకరించలేకపోయారో వైసీపీ నేతలకు, అప్పటి అధికారులకే తెలియాలి.

సజ్జల శాపాలు..
లిక్కర్ స్కామ్ లో నేతలు, అధికారులు ఒక్కొక్కరే అరెస్ట్ అవుతున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ తో ఈ వ్యవహారం పీక్ స్టేజ్ కి చేరిందనే చెప్పాలి. నెక్స్ట్ ఎవరు అంటే అందరూ జగన్ వైపే వేలు చూపిస్తున్నారు. ఈ దశలో ఇంక చేయడానికేముందంటూ సజ్జల వేదాంతం మాట్లాడారు. తప్పుడు కేసులు పెట్టిన ఉసురు చంద్రబాబుకి తగులుతుందని, కేసుల్లో జైలుకి వెళ్లిన వారి కుటుంబాల ఉసురు కచ్చితంగా తగిలి తీరుతుందంటూ శాపనార్థాలు పెట్టారు.


విజయసాయిపై రుసరుస
ఇక ఫైనల్ గా విజయసాయిరెడ్డిపై కూడా సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్నంత కాలం లిక్కర్ కేసుపై విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి.. పార్టీ నుంచి బయటకు వెల్లిన తర్వాతే కేసుపై ఎందుకు మాట్లాడారంటూ ప్రశ్నించారాయన. మిథున్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అంటున్న సజ్జల, న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. లిక్కర్ స్కామ్ నిధులు ఎన్నికల్లో ఖర్చు చేశారనేది కూడా తప్పుడు అభియోగం అన్నారు సజ్జల. మొత్తానికి మిథున్ రెడ్డి అరెస్ట్ తో వైసీపీలో కలకలం రేగింది. జగన్ దగ్గర్నుంచి నేతలంతా ఒక్కొక్కరే ఈ కేసుపై స్పందిస్తున్నారు. మిథున్ రెడ్డికి మద్దతుగా తమ గళం విప్పుతున్నారు.

Related News

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Big Stories

×