BigTV English
Advertisement

Anushka Shetty: అనుష్క ఎక్కడికి వెళ్లినా వెంట అది ఉండాల్సిందేనా.. అంత భయమా?

Anushka Shetty: అనుష్క ఎక్కడికి వెళ్లినా వెంట అది ఉండాల్సిందేనా.. అంత భయమా?

Anushka Shetty: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో సీనియర్ నటి అనుష్క శెట్టి(Anushka Shetty) ఒకరు. సూపర్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇక బాహుబలి(Bahubali) సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సొంతం చేసుకున్న అనుష్క ఇటీవల కాలంలో సినిమాలను పూర్తిగా తగ్గించారని చెప్పాలి. అనుష్క తన కెరియర్ లో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలకు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చారు.


ఘాటీ  సినిమా..

ఇటీవల అనుష్క భారీ శరీర బరువు పెరిగిన నేపథ్యంలోనే పెద్దగా బయటకు రావడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇక త్వరలోనే డైరెక్టర్ క్రిష్ (Krish)దర్శకత్వంలో అనుష్క నటించిన ఘాటీ (Ghaati)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే సెప్టెంబర్ 5వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతుందంటూ వార్తలు వస్తున్న ఇప్పటివరకు అధికారక ప్రకటన మాత్రం తెలియజేయలేదు. తాజాగా అనుష్కకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.


హర్రర్ సినిమాలు…

అనుష్కకు భక్తి అంటే కూడా ఎక్కువ అనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈమె సినిమా షూటింగ్ లో భాగంగా లేదా వ్యక్తిగత కారణాలవల్ల ఎక్కడికి ప్రయాణం చేసినా తన వెంట మాత్రం ఖచ్చితంగా సాయిబాబా(Sai Baba) విగ్రహాన్ని తీసుకువెళ్తారని తెలుస్తోంది. సాయిబాబా అంటే అమితంగా ఇష్టపడే అనుష్క ఎక్కడికి వెళ్ళినా బాబా విగ్రహం మాత్రం తనతోనే ఉండేలా చూసుకుంటారట. బాబా విగ్రహాన్ని తనతో తీసుకెళ్లడం వల్ల ఏదో తెలియని ధైర్యం ఉంటుందని ఈమె పలు సందర్భాలలో వెల్లడించారు. ఇకపోతే అనుష్కకు హర్రర్ సినిమాలు (Horror Movies)అంటే చచ్చేంత భయం అనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక అనుష్క సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె లోకేష్ కనగ రాజ్ సినిమాటిక్ యూనివర్స్ లోకి కూడా అడుగుపెట్టారని తెలుస్తోంది.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ …

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్  ఎన్నో అద్భుతమైన సినిమాలను భాగం చేస్తూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారు. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా త్వరలోనే హీరో కార్తి నటించిన ఖైదీ సీక్వెల్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీక్వెల్ సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం తెలియచేయలేదు. ఇక బాహుబలి తర్వాత అనుష్క సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి ఇటీవల నవీన్ పోలిశెట్టి హీరోగా చేసిన మిస్ శెట్టి.. మిస్టర్ పోలి శెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఘాటీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Also Read: Nagavamshi: పెద్ద హీరోలు సంక్రాంతి నుంచి తప్పుకోవాలి.. చిన్న సినిమాలకు ఛాన్స్ ఇవ్వండి!

Related News

Fauzi: ఫౌజీ కోసం తెగ కష్టపడుతున్న ఘట్టమనేని వారసుడు..  పెద్ద టాస్కే ఇదీ!

Jatadhara trailer : ఇంకెన్ని రోజులు అవే దయ్యాలు కథలు? ఈ దర్శక నిర్మాతలు మారరా?

Sree vishnu: సితార ఎంటర్టైన్మెంట్ లో శ్రీ విష్ణు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా విష్ణు కొత్త సినిమా!

Chinmayi: తాళి వేసుకోవడంపై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన చిన్మయి!

Allu Aravind: సరైనోడు 2 అప్డేట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఎప్పుడొచ్చినా సరే అంటూ!

Dulquer Salman: పెళ్లిలో ఫుడ్ పాయిజన్..  దుల్కర్ సల్మాన్ కు నోటీసులు?

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

Big Stories

×