E-Paper
Advertisement

Sajjala : ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఇప్పటం, విశాఖలపై సజ్జల..

Sajjala : ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఇప్పటం, విశాఖలపై సజ్జల..
Advertisement

Sajjala : ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నెలరోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శమన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. విశాఖలో వైఎస్ఆర్ సీపీ నిర్వహించిన గర్జన రోజునే పవన్‌ అక్కడికి వచ్చి ఉద్దేశపూర్వంగానే రాద్ధాంతం చేశారని మండిపడ్డారు.

Advertisement

ఇప్పటం గ్రామంలో జరిగిన ఘటనపై టీడీపీ, జనసేన రాద్దాంతం చేస్తున్నాయని సజ్జల ఆరోపించారు. ప్రభుత్వం ఆక్రమణలను కూల్చాలా..? వద్దా..? అని ప్రశ్నించారు. ఏం జరగకపోయినా సినిమా స్క్రిప్ట్‌ రాస్తున్నారని ఆరోపించారు. ఇప్పటంలో పవన్‌ అంత ఆవేశం ఎందుకు ప్రదర్శించారో అర్థం కావడంలేదన్నారు. ఇప్పటంలో గోడ కూడా కూల్చలేదని స్పష్టం చేశారు. అయినా సరే రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబుపైనా సజ్జల విమర్శలు గుప్పించారు. నందిగామలో రాయితో దాడిచేశారని చంద్రబాబు డ్రామా చేశారని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బాబు మాయాబజార్‌ చూపించారని విమర్శించారు. చంద్రబాబు పాలనంతా కరువే ఉందన్నారు.

Related News

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

Big Stories

Advertisement
×