Warangal Maoists : వరంగల్‌లో మావోలు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో సబ్బుక గోపాల్(45)ను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. ఇన్ఫార్‌గా మారడంతోనే తాము అతన్ని చంపినట్లు ఘటనా స్థలంలో లేఖను వదిలి వెళ్లారు. సురవీడు పంచాయతీ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇన్‌ఫార్మర్లు గనుక మారకపోతే వారికి ఇలాంటి శిక్షలు తప్పవని లేఖలో హెచ్చరించారు మావోయిస్టులు. సంఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.